
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఇప్పుడేంటి.. గత అరవై, డభై ఏళ్లుగా పాజిటీవ్‌నే.. అంటూ ఛలోక్తులు వేశారు.. అంతే కాదు కరోనాని సైతం లైట్ తీసుకున్నారు. ఇక అంతే కాదు తన అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు కంగారు పడొద్దంటూ.. తన ఆరోగ్యం పూర్తిగా అదుపులోనే ఉందని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటానని అన్నారు. ఇక సింగీతం సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ఓ ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. దానికి సంబంధించిన స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి.
ప్రస్తుతం డాక్టర్ల సూచనలు పాటిస్తూ ఐసొలేషన్‌లో ఉన్నాను, ప్రత్యేకమైన గదిలో గడుపుతుంటే హాస్టల్ రోజులు గుర్తొస్తున్నాయి.. సెప్టెంబర్ 22తో క్వారంటైన్ పూర్తవుతోంది.. తర్వాత ఎప్పటిలానే నాకిష్టమైన పుస్తకాలు చదువుతాను.. నా యోగక్షేమాలు తెలుసుకుంటూ, నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు సింగీతం శ్రీనివాస రావు. కరోనా వచ్చినంత మాత్రానా భయపడొద్దని .. ధైర్యంగా ఎదుర్కోవాలని.. అందుకోసం ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలని అన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే.