
ఈ చిత్రం ఏమాత్రం అంచనాలను తగ్గకుండా ఉండేందుకు తాజాగా ఒక ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. తెలుగు ప్రేక్షకులకు పరిచితమైన కొంతమంది కమెడియన్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా కాజల్ అగర్వాల్ భయపడి పోలీస్ పాత్రలో కనిపించబోతోంది.దయ్యాలంటే భయపడే కాజల్ అగర్వాల్ ను కొన్ని కారణాల వల్ల దయ్యాలు ఇబ్బందులు పెడతాయి ఆ తర్వాత ఆ దయ్యాలు ఏంటి వాటి నుంచి కాజలు అగర్వాల్ ఎలా తప్పించుకున్నారు అనే విషయాన్ని చూపించబోతున్నారు.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌తో పాటు కేఎస్ రవికుమార్ యోగి బాబు ఊర్వసి సత్యం తదితరులు నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 17వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో ఎలాంటి పెద్ద సినిమాలు పోటీ లేని కారణంగా కాజల్ కోస్టి సినిమా ప్రేక్షకులను భయపేడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కాజల్ అగర్వాల్ ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ఇంటర్వ్యూలలో ఈవెంట్లకు కూడా హాజరు కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈమె ఈ సినిమాని మొదట తమిళంలో నటించింది. అక్కడ కూడా ఈ సినిమా పరవాలేదు అనిపించుకోవడంతో కోస్టి పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. మరి ఏ మేరకు ఈ సినిమా అభిమానులను మెప్పిస్తుందో చూడాలి మరి.