జబర్దస్త్ వేణు డైరెక్టర్ గా మారి చేసిన బలగం సినిమా థియేటర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కాగా డిజిటల్ రిలీజ్ తర్వాత కూడా సినిమా థియేటర్ లో వసూళ్లు సాధించింది. ఈ సినిమా నిర్మించిన హర్షిత హాన్షిత ల కన్నా డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు భారీ లాభాలు తెచ్చుకున్నాడు. సినిమా ఓన్ రిలీజ్ కాబట్టి ఆ సినిమా ద్వారా వచ్చిన మొత్తాన్ని దిల్ రాజు వారికే ఇచ్చేసినట్టు తెలుస్తుంది. బలగం సినిమా విషయంలో విచిత్రంగా సినిమాను గ్రామాల్లో స్పెషల్ స్క్రీన్స్ వేసుకుని మరీ చూశారు.

ఒకప్పుడు పల్లెల్లో పండుగల్లో ఎలాగైతే సినిమాలు తెర మీద వేస్తారో ఇప్పుడు బలగం సినిమాను వాడవాడలా అలా చూశారు. ఈ విషయంపై దిల్ రాజు కొద్దిగా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే ఈ సినిమా లేటెస్ట్ గా స్టార్ మాలో రిలీజైంది. బలగం సినిమా థియేటర్ లో చూసిన వారు చూడని వారు.. డిజిటల్ లో చూసిన వారు చూడని వారు మరోసారి సినిమాను స్టార్ మాలో చూశారు. అందుకే సినిమాకు బ్లాక్ బస్టర్ రేటింగ్ వచ్చింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈమధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు కూడా రానటువంటి రేటింగ్ బలగం సినిమాకు వచ్చినట్టు తెలుస్తుంది.

14.3 రేటింగ్ అంటే అది మాములు విషయం కాదు. ఆల్రెడీ గ్రామాల్లో స్పెషల్ గా తెరలు వేసి మరీ చూసినా సరే బలగం సినిమాకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. కాబట్టి సినిమా బుల్లితెర మీద రాగానే మరోసారి సినిమాను ఆదరించారు. ఈ క్రమంలో సినిమాకు సూపర్ రేటింగ్ వచ్చింది. స్టార్ మా లో దాదాపు కొన్నేళ్లుగా ఏ సినిమాకు రాని రేటింగ్ బలంగ సినిమాకు వచ్చినట్టు తెలుస్తుంది. బలగం మరోసారి తన సత్తా ఏంటో చాటిందని చెప్పొచ్చు. సినిమా ఎంత ఇంప్యాక్ట్ కలుగచేస్తేనే అంత రేటింగ్ తెచ్చుకుంటుందని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: