మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళంలో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అంది సాధించిన వేదలం అనే మూవీ కి అధికారిక రీమిక్ గా రూపొందుతుంది. తమిళం లో ఈ సినిమాలో అజిత్ హీరోగా నటించాడు . ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భోళా శంకర్ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మిల్క్ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

కీర్తి సురేష్ ... సుశాంత్మూవీ లో కీలక పాత్రలలో కనిపించనుండగా ... ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. మధ్యలో ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది అని వార్తలు వచ్చాయి. దానితో ఈ మూవీ మేకర్స్ స్పందించి ఈ మూవీ ని మొదట చెప్పిన తేదీ అయినటు వంటి ఆగస్టు 11 వ తేదీనే విడుదల చేయనున్నట్లు మరోసారి అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

తాజాగా ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ కేవలం కొంత భాగం మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. దానిని కూడా జూన్ మొదటి వారంలో ఈ మూవీ యూనిట్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా మొదలు పెట్టి ఫుల్ స్పీడ్ లో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి ఈ సినిమాను ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: