దక్షిణాది భాషలన్నింటిలోకి తెలుగులో హీరోయిన్ కు ప్రాధాన్యం ఎక్కువ. అందుకే దాదాపుగా కొందరు దర్శకులు కొత్త హీరోయిన్లను పరిచయం చేస్తూ ఉంటారు. గ్లామర్ తో పాటు నటనతో నటించి క్లిక్ అయితే వారికి కొన్నేళ్ల పాటు ఆదరణ ఉంటుంది. అలా తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి క్రేజ్ దక్కించుకుంది కీర్తి రెడ్డి. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన గన్ షాట్ సినిమా ద్వారా పరిచయం అయింది. తర్వాత కొన్ని తమిళ సినిమాలు చేసంది.

IHG

 

ఆపై మళ్లీ తెలుగులో చేసిన ఓ సినిమా ద్వారా భారీ క్రేజ్ వచ్చింది. ఆ సినిమానే పవన్ కల్యాణ్ కెరీర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచిన ‘తొలిప్రేమ’. ఈ సినిమా ద్వారా పవన్ కు ఎంత పేరొచ్చిందో కీర్తి రెడ్డికి కూడా అంతే పేరు వచ్చింది. సినిమాలో ఆన్ స్క్రీన్ పెయిర్ గా వీరిద్దరి జోడీ ఎంతో ఆకట్టుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పవన్ తో పాటు కీర్తి రెడ్డికి కూడా అవకాశాలు క్యూ కడతాయనే భావించారు. కానీ.. కొన్ని సినిమాలు మినహా కీర్తి రెడ్డికి పెద్దగా ఆఫర్లు రాలేదు. వడ్డే నవీన్ తో ప్రేమించే మనసు, నాగార్జున రావోయి చందమామలో ఓ పాత్ర మినహా ఆమెకు అవకాశాలు రాలేదు.

IHG

 

వచ్చిన కొన్ని హిందీ సినిమాలు మాత్రం చేసింది. తర్వాత తెలుగులో చాన్నాళ్ల తర్వాత 2004లో వచ్చిన అర్జున్ సినిమాలో మహేశ్ కు చెల్లెలిగా నటించింది. అదే ఏడాది హీరో సుమంత్ ను వివాహం చేసుకుంది. తర్వాత కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. ఆపై ఎటువంటి సినిమాలు కీర్తి రెడ్డి చేయలేదు. దీంతో.. భారీ బ్లాక్ బస్టర్ సినిమా చేసి పేరు తెచ్చుకున్నా పెద్దగా రాణించక నటిగా కనుమరుగైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: