- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )


టాలీవుడ్ సీనియ‌ర్ హీరో యిన్ స‌మంత పుట్టిన రోజు ముగిసింది.. చాలా స‌ర్ ప్రైజ్ లు ఉంటాయ‌ని ఆశించిన అభిమానుల‌కు నిరాశ త‌ప్ప‌లేదు. ఈ సారి స‌మంత పుట్టిన రోజు చుట్టూ చాలా స్పెక్యులేష‌న్ న‌డిచింది .. అయినా అవేవి నిజాలు కాలేదు. బ‌న్నీ - అట్లీ సినిమా లో స‌మంత‌ను హీరోయిన్ గా తీసుకుంటార‌ని ఒక్క‌టే పుకారు లేచింది. దీనిపై ఆమె పుట్టిన రోజు కానుక‌గా అఫీషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ కూడా ఉంటుంద‌ని చెప్పారు. అది కూడా జ‌ర‌గ‌లేదు. మ‌రో వైపు త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి కూడా ప్ర‌క‌ట‌న ఉంటుంద‌న్నారు. ఎందుకంటే ఆమె రాజ్ నిడుమోరు తో క‌లిసి డేటింగ్ చేస్తోంద‌ని .. వీరిద్ద‌రి పెళ్లి గురించి రెండు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో వీరి ద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నార‌ని .. పెళ్లిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌డం ఒక్క‌టే త‌రువాయి అని అంద‌రూ అనుకున్నారు.


కానీ అలాంటి ప్ర‌క‌ట‌న ఏది రాలేదు ... బ‌న్నీ .. స‌మంత కాంబినేష‌న్ అంటే ఖ‌చ్చితంగా ఈ ప్రాజెక్టు విష‌యంలో అంచ‌నాలు మామూలుగా ఉండ‌వు. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇక అటు డైరెక్ట‌ర్ అట్లీ డైరెక్ష‌న్ లో కూడా స‌మంత పోలీసుడు ( త‌మిళం లో తెరీ ) లాంటి సినిమాలో న‌టించింది. ఇప్పుడు మళ్లీ ఈ ముగ్గురి కాంబినేష‌న్ వ‌స్తే చూడాల‌ని ఆశ ప‌డిన సినీ ప్రియుల కోరిక నెర‌వేరేలా లేదు. ఇక స‌మంత రీసెంట్ గా నిర్మాత అవ‌తారం ఎత్తి నిర్మించిన శుభం సినిమా ట్రైల‌ర్ ఇటీవ‌లే రిలీజ్ అయ్యింది. ఈ సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: