సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మహేష్ బాబు మంచితనం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మందికి ఉచితంగా వైద్యం చేయిస్తున్నారు. ప్రిన్స్ అందం గురించి ఎంత పొగిడిన తక్కువే. మహేష్ బాబు ఎంత అందంగా ఉంటారో.. ఆయన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది.
 
అయితే ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా.. రీరిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉన్నాయి. హిట్ తో సంబంధం లేకుండా మంచి టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలు సైతం మరోసారి రీరిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే హిట్ కొట్టిన మురారి, ఇంద్ర, గబ్బర్ సింగ్, భద్రి, హ్యాపీ డేస్ సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. అలాగే వాటితో పాటుగా ఫ్లాప్ అయిన సినిమాలు.. హీరో సిద్దార్థ్, బేబీ శ్యామలి తెరకెక్కించిన లవ్ స్టోరీ ఓయ్, రామ్ చరణ్ నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ ఆరెంజ్ సినిమాలు రీరిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తో పాటు కలక్షన్స్ కూడా బాగానే సొంతం చేసుకున్నాయి.


ఈ క్రమంలో త్వరలో మరో మంచి బ్లాక్ బస్టర్ సినిమా రీరిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఆ సినిమా ఏంటి అని ఆలోచిస్తున్నారా. అదేనండీ మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా. ఈ సినిమా అంటే చాలు నెటిజన్స్ పడి చచ్చిపోతారు. ఈ మూవీలో హీరోయిన్ గా అనుష్క శెట్టి నటించారు. ప్రేక్షకులు ఎప్పటినుండో ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 30వ తేదీన ఖలేజా మూవీ రీరిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కొట్టలేకపోయినా.. ఈసారి మాత్రం మంచి కలెక్షన్స్ సంపాదిస్తుంది. ఈ మూవీ ఇంతకుముందు రీరిలీజ్ అయిన సినిమాలను నెట్టేస్తుందని టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ మూవీ మిగితా మూవీస్ ని బీట్ చేస్తుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతూ.. సంతోషంలో మునిగిపోయారు. 
ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఎట్టకేలకు సినిమా రాబోతుంది. ఎస్ఎస్ఎంబి 29 మూవీ షూటింగ్  కూడా మొదలైన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: