ఏంటి సౌందర్య కి లవ్ లెటర్ రాస్తే రామోజీరావుతో ఆ హీరో గొడవ ఎందుకు పెట్టుకున్నారు. ఇంతకీ రామోజీరావుతో గొడవ పెట్టుకున్న ఆ హీరో ఎవరు.. సౌందర్య కి లవ్ లెటర్ ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు డీటెయిల్ గా తెలుసుకుందాం. సౌందర్య తెలుగు తెరపై ఎప్పటికీ మర్చిపోలేని అందం. ఈమె చనిపోయినప్పటికీ సినిమాల రూపంలో ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ బతికే ఉంటుంది. అయితే అలాంటి సౌందర్య బతికున్న సమయంలో ఎంతో మంది హీరోలతో జోడి కట్టింది.వందకి పైగా సినిమాలో హీరోయిన్గా నటించింది.అయితే ఏ హీరో హీరోయిన్ కెరియర్లో అయినా కొన్ని మచ్చలు ఉంటాయి.. అలా సౌందర్య కెరియర్ లో కూడా కొన్ని ఉన్నాయి.సౌందర్య వెంకటేష్, జగపతిబాబు వంటి హీరోలతో డేటింగ్ చేసింది అనే రూమర్లు అప్పట్లో ఎక్కువగా వినిపించాయి. 

దానికి కారణం ఈ ఇద్దరు హీరోలతో సౌందర్య ఎక్కువ సినిమాలు చేయడమే.అయితే జగపతిబాబుతో సౌందర్య లవ్ మేటర్ ఎక్కువగా వినిపించింది. ముఖ్యంగా జగపతిబాబు కి పెళ్లయ్యాక కూడా సౌందర్యని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారనే వార్తలు వినిపించాయి. అయితే రామోజీరావుకు చెందిన ఒక ప్రముఖ పత్రికలో హీరో జగపతిబాబు సౌందర్య కి లవ్ లెటర్ రాసారు అంటూ ఒక పెద్ద వార్త రాసారట.ఇక అంత పెద్ద పేపర్లో జగపతిబాబు సౌందర్య గురించి వార్త రావడంతో ఇది చూసి జగపతిబాబు కోపంతో రామోజీరావు దగ్గరికి వెళ్లి ఇదేంటి..ఇలా రాశారు.. అసలు పర్సనల్ విషయాల గురించి ఇలా బహిరంగంగా వార్త పేపర్లో రాయొచ్చా.. ఇంత చెత్త వార్త రాసింది ఎవరు..నేను ఫ్యామిలీతో ఉండాలని అనుకోవడం లేదా... నాకు పెళ్లయి పిల్లలు ఉన్నారు.

ఈ విషయం నిజమే అనుకుంటే నా పరిస్థితి ఏమవుతుంది. నా విషయం పక్కన పెట్టండి హీరోయిన్ సౌందర్య కి భవిష్యత్తులో పెళ్లి కావాలి.ఈ వార్త వల్ల భవిష్యత్తులో  ఆమెకి ఏమైనా ఇబ్బందులు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ రామోజీరావు పై ఫైర్ అయ్యారట జగపతి బాబు.దాంతో ఈ వార్త రాసింది ఎవరో తెలుసుకొని వెంటనే ఆ వ్యక్తిపై యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేశారట రామోజీ రావు. ఇక జగపతిబాబు సౌందర్య ని ప్రేమించారో ప్రేమించలేదు తెలియదు కానీ సౌందర్య అంటే చాలా ఇష్టమని,ఆమె మరణించిన సమయంలో తాను కూడా చనిపోవాలనుకున్నట్టు జగపతిబాబు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక సౌందర్య చనిపోయినప్పుడు కేవలం జగపతిబాబు మాత్రమే కాదు ఆయనతో కలిసి నటించిన ప్రతి ఒక్క హీరో హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: