
నేడు ఉదయం ఇంజనీరింగ్ స్ట్రీంకు, మద్యాహ్నం మెడిసిన్ స్ట్రీంకు పరీక్షలు జరుగుతాయి. 12 న తొలి కీ విడుదల చేస్తారు, దానిపై అభ్యంతరాలుంటే 18లోగా తెలియజేయజేసే అవకాశముంది. జూన్ 2న ఫలితాలు ప్రకటిస్తారు. పరీక్ష నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. హాల్ టికెట్ల తనీఖీ, అభ్యర్థుల తనీఖ, ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్ల తనిఖీ సహా అన్ని దశల్లో ఎమ్సెట్ కమిటీ ఈసారి పోలీసుల సహకారాన్ని తీసుకుంటోంది.
అభ్యర్థులు వేరే ప్రాంతాల్లో ఉండి, ఇతర ప్రాంతాల్లో పరీక్షలు రాయదలచినా అభ్యర్థులపై కూడా నిఘా ను ఏర్పాటు చేశారు. అనుమానితులు, రిపీటర్లు దాదాపు 2వేల మందిపై నిఘా పెట్టారు, వారి వివరాలు అన్నీ పోలీసులకు అందించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా చూసేందుకు శిక్షన పొందిన బాంబుస్క్వాడ్ లను ఉపయోగిస్తున్నారు. కాగా పరీక్ష కేంద్రాలకు చేరుకునేందేకు వీలుగా విద్యార్థులకు ప్రత్యేకంగా ఆర్టీసి బస్సు సౌకర్యాలు కల్పిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వారికి అనుకూలమైన కేంద్రాలను ఎంపిక చేసుకున్నారు.