సరిహద్దులలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత్ అనేక ఆయుధాల పరీక్షలను చేస్తుంది. మరికొన్ని ఆయా దేశాల నుండి కూడా కొనుగోలు చేస్తుంది. దేశీయంగా కూడా కొన్నిటిని తయారుచేస్తుంది. దానికోసం రక్షణ శాఖ పరిశోధనా సంస్థ ఇప్పటికే అనేక విజయాలు సాధించిన విషయం తెలిసిందే. సరిహద్దులలో చైనా దూకుడుకు చెక్ పెట్టడానికి భారత్ తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతుంది. గతంలో మాదిరి తగ్గే పరిస్థితి లేదని, ఈసారి ఎవరైనా భారత్ పైకి అకారణంగా వస్తే, వాళ్లకు తగిన విధంగా బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే కేంద్రం, రక్షణ మంత్రి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చైనా ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ, ఈసారి గట్టిదెబ్బ కొట్టడానికి భారత్ సన్నద్ధం అవుతుంది. కేవలం ఎవరి అధికారం కోసమో ఇతర దేశాలపై అకారణంగా యుద్ధాలకు దిగితే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది భారత్ చూపించాలని అనుకుంటుంది.

ఈ నేపథ్యంలోనే ఇటీవల అనేక ఆయుధాలను, ఇతర వనరులను సమకూర్చుకుంటుంది. ఇప్పటికే చైనా సరిహద్దులలో భారీగా సైన్యాన్ని మోహరించింది, అక్కడే వాళ్ళు కూడా ఆయా యుద్ధ తర్ఫీదులు పొందుతున్నారు. వాళ్ళు కూడా అనేక ఆయుధ పరీక్షలు అక్కడే చేపడుతున్నారు. దానికి తగ్గట్టుగానే భారత్ కూడా వాళ్ళకంటే ఎక్కువ సైన్యాన్ని సరిహద్దులలో మోహరించింది. మన సైన్యం కూడా నిత్యం తగినవిధంగా తర్ఫీదులు పొందుతూ, వివిధ సన్నివేశాలకు తయారవుతున్నారు. ఇక చైనా అనేక క్షిపణి ప్రయోగాలను రహస్యంగా చేస్తున్నప్పటికీ, ఏదో విధంగా ఆయా సమాచారం బయటకు వస్తూనే ఉంది. భారత్ కూడా వివిధ క్షిపణుల పరీక్ష చేపడుతూనే ఉంది.  

తాజాగా అగ్ని-పి(ప్రైమ్) బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది భారత్. ఈ ప్రయోగం కూడా విజయవంతం అయ్యింది. ఇది వార్ హెడ్ లను మోసుకెళ్లగలదు. 1000-2000కిమీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. రెండు దశలుగా పనిచేసే ఈ క్షిపణి, లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించగలదు. రెండో దశలో అధునాతన సాంకేతికతతో కూడి ప్రయోగం సఫలీకృతం అయ్యింది. ఇది అన్ని అగ్ని సిరీస్ లలో బాగా తేలికగాను, చిన్నదిగాను ఉంటుంది. దీని బరువును 50 శాతం తగ్గించడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. దీనిలో సరికొత్త ప్రొపల్షన్, అధునాతన నావిగేషన్ టెక్నాలజీ, గైడెన్స్ వ్యవస్థలు పొందుపరిచారు. దీనిని రైలు, రోడ్డు మార్గాల ద్వారా వివిధ వాహనాల నుండి కూడా ప్రయోగించవచ్చు. ఈ క్షిపణులను లాంచ్ చేయడానికి కూడా తక్కువ సమయం పడుతుంది. అలాగే వివిధ ప్రాంతాలకు తీసుకోని వెళ్ళడానికి కూడా సులభంగా ఉంటుంది.

భారత్ వద్ద ఉన్న అణు సామర్థ్యం ఉన్న క్షిపణులలో అగ్నికి ప్రత్యేకత ఉంది. 700-800కిమీ రేంజ్ వరకు అగ్ని 1; 2000కిమీ రేంజ్ వరకు అగ్ని 2; 2500కిమీ రేంజ్ వరకు అగ్ని 3; 3500కిమీ రేంజ్ వరకు అగ్ని 4; 5000కిమీ రేంజ్ వరకు అగ్ని 5. 12000కిమీ రేంజ్ లో లక్ష్యాలను ఛేదించగలిగే విధంగా అగ్ని 6 ను తయారుచేయడానికి సన్నాహాలు చేస్తుంది భారత్. అయితే చైనాకు చెక్ పెట్టడానికి అగ్ని 5 సరిపోతుంది. దానితో చైనాలోని ఏ ప్రాంతాన్నైనా ధ్వంసం చేయవచ్చు. ఈ భయం ఆ దేశానికి కూడా ఉంది. అందుకే చైనా కూడా రహస్యంగా రిమోట్ ఆపరేటేడ్ క్షిపణిని పరీక్షించినట్టు అమెరికా ఇంటెలిజెన్స్ తేల్చి చెప్పింది. దానితో అణు ఆయుధాలను మోసుకొని వెళ్లి, ఎక్కడ కావాలంటే అక్కడ పేల్చేయవచు.

మరింత సమాచారం తెలుసుకోండి: