సాధారణం గా పామును చూడాలంటే ప్రతి ఒక్కరు భయపడిపోతూ ఉంటారు. పామంటే మాకు భయం లేదు అని పైకి ధైర్యంగా కనిపించిన.. లోలోపల మాత్రం ఎంతో భయపడి పోయేవారు కూడా కొంతమంది ఉన్నారు. అయితే పామును నేరుగా చూడడానికి పెద్దగా ఇష్టపడని జనాలు.. అటు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యే వీడియోలను చూడ్డానికి మాత్రం ఎక్కువ ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి ఇక పాములకు సంబంధించిన వీడియోలను తెగ చూస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే పాము కదలికలు ఎలా ఉన్నాయి? పాము ఎలాంటి పరిస్థితుల్లో దాడి చేస్తుంది అనే విషయాలపై కూడా ఈ వీడియోల ద్వారా ఇక అవగాహన పెంచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇలా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలకు కొదవ లేకుండా పోయింది అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో కొంతమంది జనాలు అటు పాములతో జాగ్రత్తగా ఉండడం మానేసి చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం చేస్తున్నారు. వెరసి ఇక ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పాలి. అయితే పాముకు భాష తెలియదు తనకు ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని అనుకుంది అంటే చాలు సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా దాడి చేయడానికి సిద్ధమవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ ఒక యువతకి ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. ఏకంగా పామును సరదాగా ముద్దు పెట్టుకోవాలి అనుకుంది ఓ యువతి. అయితే ఆ యువతి తనపై దాడి చేస్తుంది అని అప్రమత్తమైన పాము.. ఒక్కసారిగా దాడి చేసింది. యువతి ముక్కు నోటిని పట్టి లాగేసింది. ఇక పాము ఇలా దాడి చేయడంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరూ కూడాషాక్ అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: