కొంటే ఎలక్ట్రిక్ బస్సులు కొనాలని, లేకపోతే అద్దెకు డిజీల్ బస్సులు తీసుకోవాలని ఏపీ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డిజీల్ బస్సులు లేకపోతే చాలా వరకు కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణం మెరుగుపడుతుంది. ప్రస్తుతం ఏపీలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టబోతున్నారు. విశాఖ, కాకినాడ, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లో వీటిని ప్రవేశపెట్టనున్నారు.


దీంతో ఏటా 50 మెట్రిక్ టన్నుల కర్భన ఉద్గారాలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డిజీల్ ఖర్చు విపరీతంగా తగ్గుతుంది. ఎలక్రిక్ బస్సుల కొనుగోలుకు డబ్బులు ఎక్కవ అవుతాయి. బ్యాంకు లోను ద్వారా వాటిని తీసుకోవచ్చు. ఆర్టీసీ డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సుల రిపేర్లు చేయలేరు. పెట్రోల్, డిజీల్ తో నడిచే బస్సులను రిపేర్ చేసేవాళ్లు ఉంటారు. ఒక వేళ సమస్యలు వస్తే వీరు ఎంత వరకు చేస్తారనేది చూడాలి.


ఎలక్ట్రిక్ బస్సుల రిపేర్ కోసం ప్రత్యేకంగా ఎవరినైనా రిక్రూట్ చేసుకోవాల్సిందే. ముఖ్యంగా ఐఐటీ లో చదివే విద్యార్థులు, వీటి కోసం ప్రత్యేకంగా చదివినా వారు ఎవరైనా ఉంటే వారిని ఉద్యోగంలోకి తీసుకోవచ్చు. ప్రస్తుతంఎలక్ట్రిక్ బస్సులు రిపేర్ చేసేవాళ్లు తక్కువగా ఉంటారు. కానీ దీని కోసం కొనకుండా ఊరుకుంటే పొరపాటు అవుతుంది. ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలి. తద్వారా కాలుష్యం తగ్గించడమే కాకుండా డిజీల్, పెట్రోల్ కు పెడుతున్న ఖర్చు కూడా తగ్గుతుంది.


ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెంచాలంటే వాటి నిర్వహణ మెరుగ్గా ఉండాలి. ఎప్పటికప్పుడు ఛార్జింగ్, నిర్వహణ తదితర అంశాలపై అవగాహన ఉన్న వారిని ఉద్యోగంలో నియమించుకోవాలి. ఎలక్ట్రిక్ బస్సుల వాడకం పెరిగితే చాలా వరకు పర్యావరణం మెరుగు పడుతుంది.  చాలా పాశ్చాత్య దేశాల్లో ఈ విధమైన వాహనాలను వాడుతున్నారు. కానీ విద్యుత్ వాడకం ఎలా ఉంటుందనేది కూడా ఒక సారి పూర్తిగా తెలుసుకుంటే బాగుంటుంది. ఒక సారి ఛార్జింగ్ పెడితే ఎన్ని యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుందో కూడా పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: