
ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో వి సినిమాతో ప్రారంభం అయిన ఈ ఓటీటీ విడుదల టాలీవుడ్ లో కంటిన్యూ అవుతోంది. త్వరలో అనుష్క 'నిశబ్దం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా తర్వాత ఇంకా పలు సినిమాలు కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో శర్వా 'శ్రీకారం' సినిమా కూడా ఓటీటీ ద్వారా విడుదల అయ్యే అవకాశం ఉంది అంటూ సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్ ల నుండి కూడా క్రేజీ ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో నిర్మాతలు ఆలోచనలో పడ్డారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిర్మాతలు ఆర్థిక భారం మోయలేక చాలా వరకు ఓటీటీ రిలీజ్ కు వెళ్తున్నారు. కాని శ్రీకారం మూవీకి ఆ సమస్య లేదు. కాని ఓటీటీ డీల్ అన్ని విధాలుగా బాగుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఆలోచనలో పడ్డారు అనేది మీడియా వర్గాల టాక్.
శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన చిత్రం శ్రీకారం. అయితే ఈ సినిమా హీరో శర్వా, దర్శకుడు కిషోర్ ల నిర్ణయంను బట్టి శ్రీకారం ఓటీటీ రిలీజ్ ఆధారపడి ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో థియటర్లకు అన్ లాక్ ప్రకటించే అవకాశం ఉన్నందున ఓటీటీకి వెళ్లే అవకాశాలు తక్కువ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకారం యూనిట్ సభ్యుల నిర్ణయం ఏంటీ అనేది చూడాలి మరి.