బాల నటుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి హీరోలుగా ఎదిగిన వారిలో తనీష్ కూడా ఒకరు. దేవుళ్ళు, మన్మధుడు వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తనీష్. "నచ్చావులే" చిత్రంతో హీరోగా తెరంగ్రేటం చేసాడు. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇది తన కెరియర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా విజయానికి మొదటి కారణం కథ, అలాగే తనీష్ నటన, అతడి కామెడీ అనే చెప్పాలి.  నచ్చావులే సినిమా కథ అంతా కూడా ఒక సామాన్యుడి లవ్ స్టొరీ లాగే ఉన్నప్పటికీ అందులో కొత్త దనాన్ని చూపించి దానికి కామెడీని జోడించి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు దర్శకుడు రవి బాబు.

ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై  రామోజీ రావు నిర్మించిన ఈ చిత్రానికి పెట్టింది తక్కువ బడ్జెట్ అయినా ఎక్కువ కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలచింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైన్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా హీరో తనీష్ కి లైఫ్ ఇచ్చిందనే చెప్పొచ్చు. తనీష్ కూడా ఈ సినిమాలో అద్బుతంగా నటించాడు. ముఖ్యంగా సహజమైన పంచ్ లతో అలరించాడు. తెలుగు హీరోయిన్ మాదవిలత గ్లామర్ ఈ సినిమాకి మరింత ప్లస్ అయ్యింది. లవ్ ట్రాక్ పై కామెడీని పండించి సెంటిమెంట్ ని కురిపించి ఆడియన్స్ ని మెప్పించిన ఈ చిత్రం టాలీవుడ్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా గుర్తింపు పొందింది.  

శేఖర్ చంద్ర సమకూర్చిన సంగీతం ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. సాంగ్స్, యాక్షన్, కాన్సెప్ట్, కామెడీ ఇలా అన్ని సమపాళ్లలో కుదిరి నచ్చావులే చిత్రం విజయానికి కారణమయ్యాయి. ఈ సినిమాలో తక్కువ పాత్రలతో సహజమైన డైలాగులతో కామెడీని పండించాడు రవి బాబు. ఒకవైపు తనీష్ సీరియస్ ప్రేమ కథ ట్రాక్ నడుస్తూనే మరోవైపు ఇంట్లో నాన్నతో కామెడీని నడిపిస్తూ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. హీరోయిన్ తండ్రికి మరియు పక్కింటి వ్యక్తికి మధ్యం మంచి డైలాగులు రాసుకున్నాడు. ఇవి ప్రెకషకులను నవ్వించడంలో సక్సెస్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: