తాజాగా అక్కినేని కుటుంబం పై బాలయ్య చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా ఎంత చర్చనీయాంశంగా మారాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో భాగంగానే బాలయ్య పై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంత జరిగినప్పటికీ బాలయ్య మాత్రం ఈ విషయంపై సరిగ్గా స్పందించలేదు. ఇటీవల ఈ వివాదాలు పై బాలయ్య పులిస్టాప్ పెడతాడు అనుకుంటే మరింత రెచ్చగొట్టేలా మాట్లాడాడు బాలయ్య. ఇందులో భాగంగానే బాలయ్య మాట్లాడుతూ.. బాబాయ్ నాగేశ్వరరావు అంటూనే ఆయన కుటుంబ సభ్యులపై పరోక్షంగా సెటైర్లు వేయడంతో అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 

ఇందులో భాగంగానే మాట్లాడుతూ.. బాబాయ్ నాగేశ్వరరావు నన్ను సొంత బిడ్డ కంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నాడు.. ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవాడు.. ఎందుకంటే ఆయన ఇంట్లో ఆయనకి ఆప్యాయత దొరికేది కాదు.. నా దగ్గరే దొరికేది అన్నట్టుగా మాట్లాడేవారు.. అంటే దీని ఉద్దేశం నాగార్జునకి నాగేశ్వరరావు మీద ఏమాత్రం ప్రేమాభిమానాలు లేవని ఆయన మాట్లాడినట్లుగా అనిపించింది. ఇందులో భాగంగానే  సోషల్ మీడియా వేదికగా నాగార్జునని బాలయ్య ఎందుకు ఇంతలా టార్గెట్ చేశాడు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్యకి నాగార్జున మీద ఇంత కోపం ఉండడానికి కారణం

 మెగాస్టార్ చిరంజీవి కి మొదటి నుండి నాగార్జున భజన చేయడమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. చాలా సందర్భాల్లో చిరంజీవి టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అని నాగార్జున చెప్పడంతో బాలయ్య ఈగో హర్ట్ అయింది. అయితే కేవలం ఆ కారణంగానే బాలయ్యకి నాగార్జున అంటే ఇంత కోపమని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే మరికొంతమంది బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి నాగార్జునాని ముఖ్యఅతిథిగా పిలిచినప్పటికీ నాగార్జున రాలేదని ఈ విషయంలో బాలయ్య చాలా హర్ట్ అయ్యాడు అని ఈ కారణంగానే నాగర్జున మీద బాలయ్యకి మరింత ద్వేషం పెరిగింది అని చాలామంది భావిస్తున్నారు. ఏదేమైనాప్పటికీ ఇలాంటి స్టార్ కుటుంబాల మధ్య గొడవలు ఉండడం తమ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.దీంతో చాలామంది దయచేసి మీ వివాదాలకు ఫుల్స్టాప్  పెట్టండి అని వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: