ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలీవుడ్ యువ హీరో లలో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బావరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిరణ్ ఇప్పటికే అనేక మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కిరణ్ నటించిన మూవీ లలో ఎస్ ఆర్ కళ్యాణ మండపం ... సమ్మతమే ... వినరో భాగ్యము విష్ణు కథ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

ఈ మూడు మూవీ లతో కిరణ్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తో మంచి విజయం అందుకున్న ఈ యువ హీరో ప్రస్తుతం మీటర్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి రమేష్ కాడురి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శ్రీ కార్తీక్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుండి ఇప్పటికే చిత్ర బృందం టీజర్ ను విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది.

మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా నుండి మొదటి పాటకు సంబంధించిన అప్డేట్ ను ఈ రోజు ఉదయం 10 గంటల 08 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ నైట్ కూడా విడుదల చేసింది. మరి ఈ మూవీ యొక్క మొదటి పాట ను తేదీన విడుదల చేస్తారో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: