టాలీవుడ్ అగ్ర హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా సినిమాలతో పాటు ఓ చిన్న సినిమా కూడా చేస్తున్నాడు డార్లింగ్. అదే మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమా. ఇప్పటివరకు ఈ సినిమా నుండి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. కానీ షూటింగ్ మాత్రం చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా 40 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సీక్రెట్ గా షూటింగ్ అంతా కంప్లీట్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు.

 ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. మారుతితో మొదటిసారి ప్రభాస్ కలిసి సినిమా చేస్తూ ఉండడంతో సినిమాపై భారీ అంచనాల నెలకొన్నాయి. అయితే తాజాగా ఎట్టకేలకు ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రంగస్థలం మహేష్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడట. అతనే ఈ విషయాన్ని బయట పెట్టాడు. ప్రభాస్ - మారుతి మూవీ ఓ రేంజ్ లో వస్తుందని వెల్లడించాడు మహేష్. అంతేకాదు ప్రభాస్ కెరియర్ లో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల రేంజ్ లో మారుతి సినిమా ఉంటుందని అన్నాడు. ఆ సినిమాలో ప్రభాస్ ఎంత ఎనర్జీతో కనిపించాడో మారుతి సినిమాలో అంతే ఎనర్జీతో కనిపిస్తాడని చెప్పుకొచ్చాడు.

ఇక డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ రేంజ్ లో మారుతి సినిమా ఉండబోతుందని రంగస్థలం మహేష్ వెల్లడించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మారుతి మూవీతో మళ్లీ వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నామంటూ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసమే ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇక మారుతి ఈ సినిమాని హారర్ అండ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు. సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది  కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరో రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయబోతున్నారట. వచ్చే ఏడాది ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: