కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రాజా విక్రమార్క.. చావు కబురు చల్లగా చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కార్తికేయ ఈ చిత్రం తో మరొకసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టుకోగా ప్రస్తుతం షెరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.  శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తుండగా సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ కథానాయికగా నటిస్తుంది.


కాగా ఈరోజు కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా లోని తొలి పాటను ఆవిష్కరించింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన రాగా ఇప్పుడు ఈ పాటకు కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంటుంది.  రాజా గారు బయటకొస్తే..  రాజా గారు వేటకొస్తే అదిరేలే..అదిరేలే అంటూ సాగిన ఈ పాట మంచి ఫాస్ట్ బీట్ తో ట్యూన్ కాగా ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం ఈ సినిమా కి హాలైట్ గా నిలవనుంది. ఈ సినిమా కి  పి.సి.మౌళి ఛాయాగ్రహణం అందిస్తుండగా జస్విన్ ప్రభు కూర్పు సమకూరుస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి, కృష్ణ కాంత్ సాహిత్యం సమకూర్చారు.

ఇకపోతే వెరైటీ వెరైటీ సినిమాలతో ఆకట్టుకున్న కార్తికేయ rx100 సినిమా తో హీరో గా పరిచయమై సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత హీరో పాత్రలకే పరిమితం అవకుండా విలన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా తో విలన్ గా చేసి బెస్ట్ విలన్ గా ఫిలిం ఫేర్ అందుకున్నాడు. అంతేకాకుండా తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న వాలిమై చిత్రంలో కూడా కార్తికేయ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా కి సంబంధించిన లుక్ ఈరోజే విడుదల కాగా కార్తికేయ ఖాతాలో మరో సూపర్ హిట్ పాడడం ఖాయం అనిపిస్తుంది ఈ సినిమా తో.. మరి ఎన్నో అంచనాల మధ్య రాబోతున్న రాజా విక్రమార్క సినిమా ఏ రేంజ్ లో కార్తికేయ కు హిట్ తీసుకొస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: