బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7 ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న కంటెస్టెంట్లలో అశ్వినిశ్రీ ఒకరు. ఈ షో ద్వారా ఈ బ్యూటీ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ వల్ల అశ్వినిశ్రీకు మూవీ ఆఫర్లు సైతం పెరిగాయని చెప్పవచ్చు. బిగ్ బాస్7 తో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.
 
తాజాగా తన పుట్టినరోజు వేడుకలను అనాథ శరణాలయంలో చేసుకోవడం ద్వారా ఈ బ్యూటీ వార్తల్లో నిలిచారు. అనాథా శరణాలయంలో ఉన్న పిల్లలకు నా వెజ్ వంటకాలను ఈ బ్యూటీ స్వయంగా వడ్డించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. అశ్వినిశ్రీ తన పోస్ట్ లో ఇతరుల కోసం జీవించకపోతే అసలు అది జీవితమే కాదు అని రాసుకొచ్చారు.
 
అనాథ శరణాలయంలో పిల్లలకు ఆమె నా వెజ్ వంటకాలను చేసి వడ్డించారు. ఇది చూసిన నెటిజన్లు అశ్వినిశ్రీ మంచి మనస్సును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని కామెంట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో అశ్వినిశ్రీ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అశ్విని శ్రీకి ప్రేక్షకుల్లో సైతం ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందని చెప్పవచ్చు.
 
అశ్విని శ్రీ సోషల్ మీడియాలో సైతం క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. అశ్విని శ్రీని అభిమానించే వాళ్లు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. చాలామంది సెలబ్రిటీలు తాము సంపాదించిన డబ్బులను వ్యక్తిగత పనుల కోసం ఖర్చు చేస్తుండగా అశ్విని శ్రీ మాత్రం వాళ్లకు భిన్నంగా అడుగులు వేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.  బిగ్ బాస్ అశ్వినిశ్రీ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: