సినీ అభిమానులకు షాకింగ్ న్యూస్. రెండు తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాలలో సినిమా థియేటర్లు బంద్ కాబోతున్నాయి. దానికి గల ప్రధాన కారణం సినీ ఎగ్జిబిటర్లు థియేటర్లను మూసేస్తున్నామని అనౌన్స్ చేశారు. తెలుగు ఫిల్మ్ చాంబర్ లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా వారు కీలక ప్రకటన చేశారు. అద్దె ప్రాతిపాదికన సినిమాలను ప్రదర్శించబోమని షాకింగ్ న్యూస్ షేర్ చేశారు. సినిమాలకు పర్సంటేజ్ రూపంలో డబ్బులను చెల్లిస్తేనే థియేటర్లలో సినిమాలను ప్రదర్శిస్తామని తీర్మానం చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నిర్మాతలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 

ఈ సమావేశానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబుతో సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయాన్ని వెల్లడించడంతో ప్రతి ఒక్క నిర్మాత ఆలోచనలో పడుతున్నారట. ఇప్పటికే నిర్మాతలు పలు సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారిగా ఎగ్జిబిటర్లు ఇలాంటి కీలక నిర్ణయాన్ని తీసుకోవడంతో నిర్మాతలు అందరూ దిగులు చెందుతున్నారు. ఎగ్జిబిటర్లు ఇలా డిమాండ్ చేయడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో దిల్ రాజు, సురేష్ బాబు ఆలోచనలో పడ్డారట.


ఎగ్జిబిటర్లు తీసుకున్న ఈ కీలక నిర్ణయానికి తెలుగు సినిమా నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకుంటారని ప్రతి ఒక్కరు ఆలోచనలో పడ్డారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఇద్దరూ సంప్రదింపులు జరుపుకొని ఏదో ఒక నిర్ణయానికి వస్తేనే కానీ అసలు విషయం వెలుగులోకి రాదు. దీనిపైన మరింత సమాచారం వెలుబడాల్సి ఉంది. ఈ విషయం తెలిసి సినీ అభిమానులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవుల కారణంగా చాలామంది కుటుంబ సభ్యులు, స్నేహితులు సినిమాలకు వెళ్లాలని ఆలోచనలో ఉన్నారు. వారికి ఇష్టమైన హీరోల సినిమాలు వస్తున్నాయని తెలిసి సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి కఠినమైన నిర్ణయం తెలియడంతో సినీ అభిమానులు బాధపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: