మెగా హీరో పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో సినీ అభిమానులకు షాకింగ్ న్యూస్ ఎదురైంది. సినిమా థియేటర్లను మూసేస్తున్నామని డిస్ట్రిబ్యూటర్లు అనౌన్స్ చేశారు. సినిమా టికెట్ల ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. జూన్ నెల నుంచి థియేటర్లను మోసేస్తామని అన్నారు. సినిమా థియేటర్ల బంద్ విషయంలో కొంతమంది భాగస్వాములు ఉన్నారని అనేక రకమైన ఆరోపణలు వచ్చాయి. 

ఇందులో రాజమండ్రి సిటీ జనసేన ఇన్చార్జ్ సత్యనారాయణ పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. దీంతో జనసేన పార్టీ అత్తి సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సినిమా తప్పకుండా రిలీజ్ అవుతుందని, థియేటర్ల బంద్ లేద ని కొంత మంది క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు సినిమా నిర్మాత ఏఎం రత్నం పవన్ కళ్యాణ్ ఫోన్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఏఎం రత్నం హైదరాబాద్ నుంచి ముంబైకి ఫ్లైట్ లో వెళ్లారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేలోపు పవన్ కళ్యాణ్ నుంచి ఏఎం రత్నంకు ఫోన్ కాల్ అందుతోంది.


 హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి టికెట్ ధరల పెంపు విషయం గురించి తనను అసలు కలవవద్దని ఏఎం రత్నంకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ విషయానికి సంబంధించి కౌన్సిల్ లోనే అప్లై చేయాలని చెప్పారట. నిబంధనలు మన సినిమా నుంచి ప్రారంభిద్దామని పవన్ కళ్యాణ్ కోరినట్లుగా తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా పవన్ కళ్యాణ్ సినిమా కోసం తన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తొందరలోనే రిలీజ్ కానుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ చేతిలో మరో రెండు మూడు సినిమాలకు పైనే ఉండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: