టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం 200 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న దర్శకునిగా రాజమౌళికి పేరుంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ గురించి అధికారికంగా ఏ అప్డేట్ రాకపోయినా ఈ సినిమాపై అంచనాలు మాత్రం మాములుగా లేవు. మహేష్ పుట్టినరోజు కానుకగా అయినా ఈ సినిమా నుండి అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా మహేష్ కు జోడీ కాదని సినిమాలో అసలు మహేష్ ప్రియాంక కాంబోలో సాంగ్స్ ఉండవని తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితం ఈ సినిమా కథకు రామాయణంకు లింక్ ఉందని వైరల్ అయినా వార్తలు సైతం సినిమాపై  అంచనాలు పెంచాయి. ఈ సినిమాలో పృథీరాజ్ సుకుమారన్  విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.  అయితే పాన్ వరల్డ్ స్థాయిలో గురింపును సొంతం చేసుకున్న దర్శకుడు  రాజమౌళి  తాజాగా కుబేర  ఈవెంట్ లో వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తొలి  రెమ్యునరేషన్  కేవలం 50 రూపాయలు కావడం గమనార్హం. ఈ  విషయాన్ని  ఆయనే స్వయంగా వెల్లడించారు. ఒక స్టూడియోలో అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేసినందుకు ఈ మొత్తాన్ని ఆయన  పారితోషికంగా అందుకున్నారు. ఆ జీతాన్ని తాను ఏం  చేశానో కూడా గుర్తు లేదని రాజమౌళి వెల్లడించారు. శేఖర్ కమ్ముల వాట్సాప్ వాడరని జక్కన్న తెలిపారు. తాను నమ్మిన సిద్దాంతం కోసం ముందుకెళ్లే దర్శకుడు శేఖర్ కమ్ముల అని  ఆయన పేర్కొన్నారు. నేను అలా  చేయనని రాజమౌళి పేర్కొన్నారు.

శేఖర్ కమ్ముల నాకు సీనియర్ అని జక్కన్న  చెప్పుకొచ్చారు. ట్రాన్స్ ఆఫ్ కుబేర రిలీజైన సమయంలో  సినిమా ఎలా ఉండబోతుందో  అర్థమైందని జక్కన్న వెల్లడించారు.  విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని  రాజమౌళి అన్నారు.  దేవీ శ్రీ ప్రసాద్ సాంగ్స్, బీజీఎమ్ బాగున్నాయని ఆయన తెలిపారు.  జూన్ 20వ తేదీన విడుదల కానున్న కుబేర  ఇండస్ట్రీని షేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: