ఏంటి అక్కినేని నాగార్జున పెద్దకోడలు శోభితని మహేష్ బాబు అవమానించారా.. సమంతతో ఉన్న స్నేహం వల్లే శోభితని అవమానించారా..ఇంతకీ శోభితను మహేష్ బాబు అవమానించారంటూ వస్తున్న వార్తల వెనుక ఉన్న నిజం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. రీసెంట్ గా అక్కినేని అఖిల్ జైనబ్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ పెళ్లి వేడుకకు తక్కువ మంది వచ్చినప్పటికీ రిసెప్షన్ కి మాత్రం ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది హీరో హీరోయిన్లు ఆర్టిస్టులు ఇలా ప్రతి ఒక్కరు వచ్చి నూతన వధూవలను ఆశీర్వదించారు. అయితే అఖిల్ జైనబ్ ల రిసెప్షన్ పార్టీకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన భార్య నమ్రత కూతురు సితారతో కలిసి వచ్చారు. ఈ రిసెప్షన్ పార్టీలో మహేష్ బాబు చాలా సింపుల్ గా ఉన్న టీ షర్టు ధరించి కనిపించారు. 

ఇక ఈ టి షర్టు చూడ్డానికి సింపుల్గానే ఉన్నప్పటికీ ధర మాత్రం లక్షకు పైగానే అని తెలియడంతో చాలామంది నోరెళ్ళబెట్టారు. అయితే ఈ రిసెప్షన్ పార్టీకి వచ్చిన సమయంలో మహేష్ బాబు నాగచైతన్య ని ఆప్యాయంగా పలకరించినప్పటికీ పక్కనే ఉన్న శోభితని మాత్రం పట్టించుకోలేదని, శోభితని మహేష్ బాబు అవమానించారని నాగచైతన్య మొదటి భార్య సమంతతో మహేష్  బాబుకి ఉన్న స్నేహం కారణంగానే శోభితతో మాట్లాడానికి కూడా మహేష్ బాబుకి ఇష్టం లేదని,చాలామంది ఓ వీడియోని వైరల్ చేశారు.కానీ ఆ వీడియో కేవలం ఎడిట్ చేసింది మాత్రమే.. అందులో ఎలాంటి నిజం లేదు.

ఎందుకంటే మహేష్ బాబు శోభితని పట్టించుకోకుండా ఆమెను పలకరించకుండా అవమానించారు అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా వాస్తవం అని తెలిసింది.ఎందుకంటే తాజాగా ఉన్న ఓ వీడియోలో మహేష్ బాబు రిసెప్షన్ పార్టీకి రావడంతోనే చైతన్య శోభిత ఇద్దరినీ ప్రేమగా పలకరించారు. నాగచైతన్యను హగ్ చేసుకున్నారు.శోభితతో మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారడంతో శోభితని మహేష్ బాబు అవమానించారు అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. శోభితతో మహేష్ బాబు మాట్లాడారు. కానీ కొంతమంది ఫేక్ వీడియోని క్రియేట్ చేసి ఇలా శోభిత పరువు తీసిన మహేష్ బాబు అంటూ రూమర్స్ క్రియేట్ చేశారు అంటూ ఈ వీడియో కింద కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: