
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో ధనుష్ నటించిన తాజా సినిమా "కుబేర". ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది అందరికీ తెలుసు. ఈ సినిమా ధనుష్ లోని మరో యాంగిల్ ని బయటపెట్టింది . కాగా ఈ సినిమా తర్వాత ధనుష్ ఎలాంటి కాన్సెప్ట్ తో రాబోతున్నాడు ..? ఎలా కనిపించబోతున్నాడు..? అని అంతా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి క్రేజీ అప్డేట్ వచ్చేసింది . ధనుష్ తన కెరీయర్లో 54వ సినిమాను దర్శకుడు విగ్నేష్ రాజాతో అనౌన్స్ చేశాడు . ఈ సినిమాపై రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు ఆసక్తి రేపుతుంది .
ఇందులో ధనుష్ నిలబడి దిగాలుగా కనిపిస్తూ ఉండగా తన పత్తి పంట కాలిపోతున్న దృశ్యాలు కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా ఎమోషనల్ డ్రామా అంటూ ఫస్ట్ పోస్టర్ తోనే అర్థం అయిపోతుంది. ఈ సినిమాలో ధనుష్ ఒక రైతుగా కనిపిస్తాడు అంటూ కూడా తెలిసిపోతుంది . మొత్తానికి గతంలో బిచ్చగాడు గెటప్ లో కనిపించి వాళ్ల బాధలు కళ్లకి కట్టిన్నట్లు చూయించిన ధనుష్ .. ఇప్పుడు రైతుల బాధలను అర్థం చేసుకుని.. ఒక ప్రిస్టీజియస్ ప్రాజెక్టులో నటించబోతున్నాడు అంటూ తెగ పొగిడేస్తున్నారు జనాలు . ధనుష్ మరో సాలిడ్ రూరల్ ఎమోషనల్ డ్రామతో రాబోతున్నారు అని క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి..!!