ఏపీ అధికార పార్టీకి ప్రజల లో సంక్షేమ పథకాల వల్ల ఎంత ఆదరణ దక్కిందో అదేరీతిలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వల్ల డ్యామేజ్ కూడా అయింది. సొంత పార్టీ నేత కావడంతో రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు జగన్ పార్టీని ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఇరుకున పడేసినట్లయింది. రాష్ట్రపతి కూడా అదే విధంగా కేంద్ర హోంమంత్రికి మరియు జిల్లాలో ఉన్న ఎస్పీకి ప్రజాస్వామ్యంలో కీలకమైన వ్యక్తులకు రఘురామకృష్ణంరాజు వైసీపీ పార్టీపై ఫిర్యాదు చేయడం జరిగింది. 

 

అంతేకాకుండా సొంత పార్టీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు అంతా అవినీతిపరులు అంటూ జగన్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే మీడియా చానల్స్ కి ఇంటర్వ్యూలు మీద ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. అదే రీతిలో జగన్ పార్టీ కూడా రఘురామకృష్ణంరాజు కి పొలిటికల్ గా చెక్ పెట్టడానికి పార్టీ తరఫున షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వటం మనకందరికీ తెలిసిందే. అయితే పార్టీ షోకాజ్ నోటీసులు అంటూ తనకు వేరే పార్టీ తరపున నోటీసులు ఇచ్చారని చెప్పుకొచ్చిన రఘురామకృష్ణంరాజు...ఇప్పుడు తాజాగా స్వరం మార్చారు. 

 

చేసిందంతా చేసి నాకూ పార్టీ హై కమాండ్ కి కొన్ని మీడియా ఛానల్స్ కావాలని గొడవలు పెట్టాలని కామెంట్లు చేయటంతో సదరు మీడియా ఛానల్స్ నోరువెళ్లబెడుతున్నాయి. అంతేకాకుండా తాను వైసీపీ పార్టీకి వీర విధేయుడు అని చెప్పుకుంటూ ఉండటంతో చాలా మంది షాక్ అవుతున్నారు.  జగన్ 20 ఏళ్లు అధికారంలో ఉండాలనే ఉద్దేశంతో నేను పార్టీ కోసం పని చేస్తున్నాను అంటూ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఈ వ్యాఖ్యలు విన్న వైసీపీ మద్దతుదారులు పార్టీలో గౌరవం దక్కించుకోవాలని ఎవరి మీద తోసేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొంతమంది అయితే రాజుగారు బాబోరు మీడియాని బలే ఇరికించారు అని సెటైర్లు వేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: