డాక్టర్. శ్రీజ సరిపల్లి..ఒక సాధారణ యువతి గా మొదలైన ఆమె ప్రయాణం ఆ తర్వాత తల్లిగా .. ఆ త‌ర్వాత‌ ఒక శక్తి గా ఎదిగింది. రెండేళ్ల వయసు వచ్చిన కొడుకులో ఎదో ఒక లోపం ఉంది అని తెలియగానే ఆమె గుండె లోతుల్లో ఎవరికి అంతు చిక్కని ఒక మనోవేదన ..ఆ సమస్య ఏమిటో తెలిసిన ఎంత డబ్బు ఖర్చు చేసిన కొడుకు అందరి పిల్లల్ల లేకపోవడం అతి చిన్న వయసులో తల్లైన ఆ అమ్మకు అర్ధం కాలేదు. ఎన్నో తెరపీలు, మరెన్నో సెంటర్లు. ఎక్కడికి తీసుకెళ్లిన ఫలితం శూన్యం. ఆ శూన్యం లో నుండి పుట్టిన ఆశ, ఆ తర్వాత ఒక ఆశయంగా మారి ఈ రోజు వేలాది మంది ఆటిజం(బుద్ధిమాంద్యం) కలిగిన చిన్నారుల తల్లుల కళ్ళల్లో ఆనందాలను నింపుతోంది. తాను తల్లిగా పడిన కష్టం మరొక అమ్మ పడకూడని పినాకిల్ బ్లూమ్స్ అనే ఒక సంస్థను ప్రారంభించి యావత్ దేశం మొత్తం అనేక బ్రాంచులను ఏర్పాటు చేసి ఆటిజం అనే ఒక సమస్యని మన దేశం నుండి తరిమికొట్టాలనే, ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలనే స్థిర సంకల్పం తో పని చేస్తున్నారు డాక్టర్. శ్రీజ సరిపల్లి. ఆమె పుట్టిన రోజు సందరంభం గా మనతో ఆవిడ పంచుకున్న విశేషాలు మీ కోసం..

నమస్తే డాక్టర్. శ్రీజ గారు
నమస్తే అండి

డాక్టర్ గా మీరు ఈ స్థాయికి చేరడానికి స్ఫూర్తి ఎవరు..?

చదువుకునే రోజుల్లో వీళ్ళలా అవ్వాలని, వాళ్ళలా అవ్వాలని నేను ఎప్పుడు అనుకోలేదు .. మొదటినుంచి నేను బ్రైట్ స్టూడెంట్ నే..  పెళ్లి తర్వాత, బాబు పుట్టిన తర్వాత కూడా నేను డాక్టర్ గా ఎన్నో మెట్లు ఎక్కాలంటే దానికి కారణం మా అయన కోటిగారు ఇచ్చిన సపోర్ట్..

పెళ్లి తర్వాత మీ చదువులో, ఎదుగుదలలో మీ శ్రీవారి (కోటి గారు) సపోర్ట్ ఎలా ఉంది..?

ప్రతి సారి, ప్రతి విషయంలో అయన నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నా ప్రతి విజయంలో ఎంతో కీలకపాత్ర ను పోషించారు మా వారు.. మాకు ఉన్న 14 కంపెనీలలో ఇద్దరం కలిసే ప్రతి నిర్ణయం తీసుకుంటాం.. అయన సపోర్ట్ లేనిది నేను ఇంతదూరం వచ్చేదాన్ని కాదు. ఎలాంటి సమస్య ని అయిన చిటికలో చక్కదిద్దుతారు.. అయన ఇన్ పుట్స్ నాకు, మా కంపెనీ ఇంత తొందరగా గ్రో అవడానికి కారణం అని నాకనిపిస్తుంటుంది.. MBBS చేయాలన్నా నన్ను న్యూట్రిషన్ వైపు వెళ్లాలని మంచి సలహా ఇచ్చి నా జీవితాన్ని మార్చారు కోటి గారు.. అప్పుడే ఇప్పటి పరిస్థితుల గురించి అలోచించి నా కెరీర్ గురించి అటుగా వెళ్లేలా చేశారు..
 

ఎంతో మంది తల్లుల చిరునవ్వులకు కారణమైన మీ నవ్వు వెనకాల మీరు పడ్డ కష్టం ఎలాంటిది.. ?
అందరి జీవితాల్లాగే మేము కూడా ఎంతో సంతోషంగా, నార్మల్ గా ఉండేవాళ్ళం. పెళ్ళైన మొదట్లో కొన్ని మనస్పర్థలు వచ్చినా ఆ తరువాత ఒకరినొకరిని అర్థం చేసుకుని మంచి లైఫ్ లీడ్ చేశాం.. బాబు పుట్టాక మా లైఫ్ ఇంకా చేంజ్ అయిపొయింది.. ఎంతో హ్యాపీ గా లైఫ్ సాగుతున్న టైం లో సడెన్ గా ఒకరు బాబు కు రెండేళ్లు వచ్చాయి ఇంకా మాట్లాడట్లేదు ఏంటి అన్నారు. అప్పుడు డాక్టర్స్ ని సంప్రదిస్తే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పేవారు.. ఆ సమయంలో మాకు ప్రపంచం తలకిందులు అయినట్లు అనిపించింది. కొత్త కొత్త జబ్బుల పేర్లు చెప్పి ఎంతో భయపెట్టేవారు..చివరికి మా అబ్బాయికి వినికిడి లోపం ఉందని గుర్తించగలిగాము.. ఆ లోపాన్ని తొందరగానే బాగుచేసుకున్నాం అయినా ఆ తర్వాత కొన్ని రోజుల పాటు మా బాబు మాట్లాడేవాడు కాదు.. దాంతో మరోమారు డాక్టర్ ని సంప్రదిస్తే దానికి మళ్ళీ ఓ థెరపీ తీసుకోవాలన్నారు. ఆ థెరపీ వల్ల మేము, మా బాబు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది..
 
మీరు ఓ ఆటిజం సెంటర్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది.. ఎప్పుడు వచ్చింది..?

ఇందాక చెప్పినట్లు మేము వెళ్లిన చాలా ఆటిజం క్లినిక్ లు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు.. ఎలా అంటే.. 45 నిముషాలు ఇచ్చే వాళ్ళ థెరపీ లో మమ్మల్ని ఆ థెరపీ ఎలా చేస్తున్నారో చూడనిచ్చేవారు కాదు.. కనీసం ఇంటికి వెళ్ళాక హోమ్ వర్క్ ఏం చేయించాలో కూడా చెప్పేవారు కాదు.. ఇలా అయితే మా బాబునే కాదు, ఇలాంటి సమస్య తో ఉన్న పిల్లలని కాపాడలేము అన్న ఆలోచనలోంచి ఈ పినాకిల్ బ్లూమ్స్ కంపెనీ పుట్టింది..ఇప్పుడు ఎంతో మంది తల్లుల మొహాల్లో చిరునవ్వులు చూస్తున్నాం.. అందరి క్లినిక్ లాగా మేము కేవలం పిల్లలకి థెరపీ ఇవ్వడమే కాదు, ఎలా థెరపీ ఇస్తున్నామో కూడా తల్లిదండ్రులకు చూపించి వారితో ప్రాక్టీస్ కూడా చేయించాలని చెప్తున్నాము..
 మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది..?
మొదట్లో చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. బాబు కి ఇప్పుడు బాగానే ఉందిగా.. ఇంటికొచ్చి థెరపీ ఇస్తున్నారు.. త్వరలో నయం అవుతుంది అని చాలామంది చాలా రకాలుగా చెప్పారు.. ఇన్వెస్ట్ మెంట్ కూడా చాలా అవుతుంది. ఎందుకు ఇప్పుడు ఈ రిస్క్ అన్నారు.. కానీ ఆ టైం లో కోటిరెడ్డి గారు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది..అయన లేకుంటే నేను ఈ కంపెనీ స్టార్ట్ చేసేదాన్ని కాదు..ఈ ఆటిజం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఎలాంటి అవగాహనా లేని సమయంలో ఈ పినాకిల్ సంస్థ ను స్థాపించడం అప్పట్లో పెద్ద రిస్క్ అయినా, మొదలు పెట్టాక ఆ ప్రాబ్లమ్ తో వచ్చే పిల్లలని చూసి షాక్ అయ్యాము.. వారందరిని చూసి ఎంతో బాధపడ్డాము .. మా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం మన దేశంలో పది లక్షలకు పైగా పిల్లలు ఆటిజం సమస్యతో బాధ పడుతున్నారు. మా దగ్గరికి వచ్చే పిల్లలో వస్తున్న మార్పుని చూసి ఎవరైతే ఈ కంపెనీ పెట్టడానికి అడ్డుతగిలారో వారే పొగుడుతున్నారు..

 

ఇతర సంస్థలతో పోలిస్తే పినాకిల్ ఎందుకు స్పెషల్ గా ఉంటుంది...?

మా బాబు సంహిత్ కి థెరపీ ఇచ్చే టైం లో చాలా చోట్లకు వెళ్ళాము.. అక్కడ దీన్ని పెద్ద సమస్య లాగ ట్రీట్ చేసేవారు కాదు.. ఎంతో చిన్న స్పేస్ లో, ఇరుకుగా క్లినిక్ లు  , థెరపీ సెంటర్ లు పెట్టి సగం సగం ట్రీట్మెంట్ ఇచ్చే వారు .. కానీ పినాకిల్ మాత్రం వాటన్నిటికీ డిఫరెంట్.. ఎంతో విశాలమైన, ప్రశాంతమైన వాతావరణంతో కూడిన కంప్లీట్ స్పేస్ లో దీన్ని నిర్మించాము.. మేము చిన్నారులు ఇచ్చే థెరపీని తల్లిదండ్రులు సైతం మరొక గదిలో ఉండి చూసేందుకు వీలుగా మేము అన్ని సదుపాయాలను కల్పించాము. ఆటిజం సమస్య వుంది అని గుర్తించిన రోజు నుండి బాబు కు నయం అయ్యే రోజు వరకు ప్రతి రోజు ప్రోగ్రెస్ ని మేము రికార్డు చేసి భద్రపరుస్తాం.

ఏ వయసు పిల్లలో ఈ ఆటిజం అనే సమస్య ను గుర్తుపట్టవచ్చు..?

పిల్లలు పుట్టిన సంవత్సరం నుంచే ఈ ఆటిజం అనే సమస్య ను గుర్తించవచ్చు. ఆటిజం సమస్య ఉన్న పిల్లలు దేనికి రియాక్ట్ అవ్వరు.. అప్పుడు మనం వారికి ఎదో సమస్య ఉందని గుర్తించాలి..నార్మల్ పిల్లలు అమ్మ స్పర్శ కి రియాక్ట్ అవుతారు కానీ వీరు దేనికి రియాక్ట్ అవ్వరు.. అప్పుడు డాక్టర్ ని సంప్రదిస్తే మంచిది..కొంతమందిలో వినికిడి సమస్య ఉంటె మరి కొంత మంది కి మాట్లాడటం సమస్య అవుతుంది.

 
పినాకిల్ సంస్థ లో ఇచ్చే ట్రీట్మెంట్ ఏవిధంగా ఉంటుంది..?

కేవలం పదివేల రూపాయలకే పెద్ద పెద్ద సంస్థలకన్నా మెరుగైన ట్రీట్మెంట్ ఇస్తున్నాం.. కెమెరా యాక్సెస్, ఎప్పటికప్పుడు బాబు యాక్టివిటీ అనలైజ్ చేసుకోవడానికి మిరాకిల్ అనే యాప్ కూడా ఏర్పాటు చేశాం..ప్రస్తుతం 1500+ పిల్లలకి మెరుగైన వైద్యం అందిస్తున్నాం.. ఇప్పుడు అందరు పినాకిల్ ఇచ్చే సేవలగురించి పెద్ద పెద్ద ఆసుపత్రులలో మాట్లాడుకుంటున్నారు.. మా చికిత్స బాగా ఉంది కాబట్టే వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నా..

రూలర్ ఏరియా లోని పిల్లలకోసం పినాకిల్ సంస్థ  ఎలాంటి ప్లాన్స్ చేయబోతుంది..?

విలేజ్ ఏరియాలలోని పిల్లలకోసం, దేశంలో ఇలాంటి సమస్య తో బాధపడుతున్న పిల్లలకోసం మేము గత నెలలోనే నేషనల్ ఆటిజం హెల్ప్ లైన్ అనే ఓ విధానాన్ని ప్రవేశపెట్టాము..దేశంలోని ఏ మారుమూల ఉన్నా తమ పిల్లల్లో ఎలాంటి సమస్య ఉన్నా ఈ హెల్ప్ లైన్ కి ఫోన్ చేస్తే వెంటనే స్పందించి అందుకు తగినట్టుగా పేరెంట్స్ కి సూచనలు చేస్తాం.. మా హెల్ప్ లైన్ నెంబర్ 9100181181.. సమస్య ను బట్టి ఫ్రీ సర్వీస్ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం.. 2015 నుంచి ఇప్పటివరకు మా సేవా సంస్థ నుంచి మేము ఇచ్చిన సర్వీసెస్ దాదాపు కోటి రూపాయలకు పైగా ఉన్నాయి.. త్వరలో 7000 + పినాకిల్ బ్లూమ్స్ సంస్థలను ఇండియా లో స్థాపించాలనే లక్ష్యం తో ముందుకు వెళ్తున్నాం..అంతే కాదు పేద చిన్నారులకు 33 శాతం ఉచిత వైద్యం కూడా చేస్తాం.


ఈ సంస్థను స్థాపించి నడుపుతున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు మొదలయ్యాయి..?

ఎప్పుడైతే ఓ మంచి కార్యక్రమం మొదలుపెడతామో అప్పుడు ఎన్నో దుష్టశక్తులు మనలని ఆపడానికి ట్రై చేస్తాయి.. అలా ఈ కంపెనీ స్థాపించాక చాలా మంది చాల రకాలుగా మమ్మల్ని ఆపడానికి ప్రయత్నించారు.. చెకింగ్ పేరుతో ఎవరెవరో వచ్చి పర్మిషన్ ఎవరు ఇచ్చారు ? ఎవరిని అడిగి ఇది నడుపుతున్నారు అనే బెదిరింపు తరహా ప్రశ్నలు ఎదురయ్యేవి.. మా సంస్థను ఎదగనీయకుండా చేయడానికి చాల కార్పొరేట్ సంస్థలు పోటీపడ్డాయి.. కొన్ని సార్లు పేరెంట్స్ ని అడ్డు పెట్టుకొని కూడా మాకు సమస్యలను సృష్టించాలని ప్రయత్నించారు. అయినా మా కష్టం, మా క్వాలిటీ వైద్యమే మమ్మల్ని ఇప్పుడు ఈ స్థాయిలో ఉంచింది.. ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా వాటిని ఎదుర్కొని చట్టపరంగా ఈ కంపెనీ ని ముందుకు తీసుకెళ్తున్నాం..


ఇన్ని కష్టాలు పడి స్థాపించిన ఈ కంపెనీ కి కారణమైన మీ కుమారుడు సంహిత్ ఇప్పుడు ఎలా ఉన్నాడు.. ?

దేవుడి దయవల్ల చాలా బాగా ఉన్నాడు.. తెలుగు బాగా వస్తుంది.. ఇంగ్లీష్ నేర్పిస్తున్నాము.. ఇప్పుడు కూడా తనని ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుతున్నాము. ఈ పినాకిల్ బ్లూమ్స్ సంస్థ పెట్టడానికి కారణం సంహిత్ కాబట్టి తనని అందరు మెచ్చుకునేలా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాం..



మీ భర్త కోటి గారి సక్సెస్ లో ఎవరు ఎక్కువ పాత్ర వహించారు..?

కోటిగారి సక్సెస్ కి పూర్తి గా ఆయనే కారణం.. అయన కష్టం, అయన పట్టుదలే ఆయనను 14 కంపెనీలకు యజమాని చేసింది.. ఫలానా వాళ్లు అయన సక్సెస్ కి కారణం అయ్యారు అనే నేను ఒప్పుకోను.. ఎందుకంటే ఏ విషయమైనా ఆయన నిర్ణయం తీసుకుని సక్సెస్ వైపు అడుగులేశారు. అసలు ఇంత చిన్న వయసులో అన్ని విషయాలు ఎలా తెలుసు ఆయనకి అని చాలా సార్లు ఆశ్చర్య పోతాను.











 



మరింత సమాచారం తెలుసుకోండి: