పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని మళ్ళీ ముంచెందుకు ప్రయత్నం చేస్తున్నారని కాపు సామాజిక వర్గం భావిస్తోందని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్ అందలం ఎక్కితే బాగుంటుందని కాపు కులం లోని యువత, పెద్దలు అభిప్రాయ పడుతున్నారని.. పొత్తు నిర్ణయాలతో పార్టీని అధపాతాళం లోకి తొక్కేసారని అంతా భావిస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.


గోదావరి జిల్లాలలో 14 తేదీ నుంచి వారాహి యాత్ర చేపట్టి పవన్ కళ్యాణ్ ఏమని చెబుతారన్న మంత్రి కొట్టు సత్యనారాయణ.. ఎవరైనా ఏ పార్టీ తో అయినా పొత్తు పెట్టుకోవచ్చు కానీ టిడిపి తో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోడానికి కాపు సామాజిక వర్గం అభ్యంతరం చెబుతొందని అన్నారు. కాపు సామాజిక పెద్దగా నా వద్దకు వచ్చిన సూచనే పత్రికా సమావేశం లో వ్యక్తం చేస్తున్నానని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. వారాహీ యాత్రకు మూడు సార్లు బ్రేకులు వేశారని మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: