
మరొకటి హమాస్, ఇజ్రాయెల్ దాడులు. అరబ్ దేశాలన్నీ కూడా హమాస్ కు మద్దతు తెలుపుతున్నాయి. సరిహద్దు దేశాలైన లెబనాన్ ఇజ్రాయెల్ పై దాడి చేస్తోంది. మరోవైపు ఈజిప్టు, ఖతార్, ఐరాస వంటి సంస్థలు హమాస్ కు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. వీటిని అడ్డు పెట్టుకొని హమాస్ ఇంకా దాడులను కొనసాగిస్తోంది. ఒకవేళ హమాస్ ఓడిపోతే తమ దేశాలకు ముప్పు అనుకుంటున్నాయో లేక తమపై భారం పడతాయో అని అరబ్ దేశాలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
అందుకే పరస్పరం భిన్న ధ్రువాలుగా ఉండే ఖతార్, సౌదీలు సమావేశ మయ్యాయి. ఈ అసాధారణ శిఖరాగ్ర సమావేశం అమెరికా రాజధానిలో జరిగింది. ఇందులో అరబ్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఖతార్ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్, సౌదీ అరేబియా కింగ్డమ్ ప్రిన్స్ పసల్ బిన్ అల్ సౌద్ జోర్డాన్ హోషెమైట్ కింగ్డమ్ ఐమన్ సఫాది, ఈజిప్టు విదేశాంగ మంత్రి సమేహ్ షుక్రి, ఇంకా పాలస్తీనా, తుర్కియే ప్రతినిధులు పాల్గొన్నారు. వీరంతా గాజాలో జరుగుతున్న కాల్పుల విరమణను తక్షణం పాటించాలని పిలుపునిచ్చారు.
ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. తమపై దాడి చేసిన హమాస్ ని అంతం చేసి గాజాను ఆక్రమించుకొని అరబ్ దేశాలకే అప్పజెప్తానని ఇజ్రాయెల్ చెబుతోంది. కాబట్టి అరబ్ దేశాలన్నీ కలిసి గాజాను పరిపాలించడంపై దృష్టి పెడతారా లేక.. హమాస్ కు మద్దతుగా వీరందరూ కలిసి ఇజ్రాయెల్ పై యుద్ధానికి దిగుతారా అనేది చూడాలి.