ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం విద్యార్థులు తమ ఎగ్జామ్ లకు సంబంధించి వాటి పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఎటువంటి ఎగ్జామ్లో రాయకుండా పాస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏడాది కరోన పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో అధికారులు విద్యార్థులకు ఎగ్జామ్ నిర్వహించాలని సిద్ధమయ్యారు. అయితే ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు ఈ రోజు ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేసింది ప్రభుత్వం. అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్లోని పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు వాయిదా పడినట్లు సమాచారం. వాస్తవానికి విద్యాశాఖ మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మే 2 వ తేదీ నుంచి ఈ పదో తరగతి ఎగ్జామ్స్ ప్రారంభం కావలసి ఉన్నది.. కానీ ఈ ఎగ్జామ్స్ ను అదే నెల 9వ తేదీకి మార్చానున్నట్లు సమాచారం అందుతోంది. ఇందుకు కారణం ఏమిటంటే ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో మార్పు జరగడమే కారణంగానే పదవ తరగతి  విద్యార్థుల పరీక్షలు వాయిదా పడడానికి కారణమని అధికారులు తెలియజేయడం జరిగింది. ఇక ఇంటర్ ఎగ్జామ్స్ మాత్రం ఏప్రిల్ 22 వ తేదీ నుంచి మే 12వ తేదీకి జరుగనున్నట్లు అధికారులు తెలియజేశారు.


మొదట ప్రకటించిన పదవ తరగతి షెడ్యూల్ ప్రకారం మే 2 వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగవలసి ఉన్నాయి.. కానీ ఒకేసారి పదవ తరగతి ఇంటర్ పరీక్షలు నిర్వహించాల్సి వస్తుందని.. ఇక పరీక్షలు ఏర్పరచడానికి సిబ్బంది కొరత ఏర్పడుతుందని ఉద్దేశంతోనే పదవ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. ఇక తాజాగా మార్పులు చేసి కొత్త షెడ్యూల్ అనుమతి కోసం పై అధికారులకు పంపించా రట అధికారులు. ఇక రేపటి కోసం కొత్త షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: