ట్రిపుల్ ఆర్ ట్రైలర్ వచ్చింది. చిత్రమేంటి అంటే ట్రైలర్ ని చూసి ఫ్యాన్స్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు, అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ హుషార్ ఒక ఎత్తు అయితే మరో వైపు జూనియర్ ఎన్టీయార్ ఫ్యాన్స్ చేసిన హంగామా కూడా చాలా ఎక్కువగా ఉంది.

మరో వైపు ట్రిపుల్ ఆర్ ట్రైలర్ ని చూసిన మెగాస్టార్ చిరంజీవి అయితే తాను ట్రిపుల్ ఆర్ ప్రభంజనం కోసం వెయిట్ చేస్తున్నాను అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిజంగా ట్రిపుల్ ఆర్ ప్రభంజనమే క్రియేట్ చేసేలా ఉంది. ట్రైలర్ ని చూస్తే మూవీ రేంజి ఏ లెవెల్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు అంటున్నారు.

మూవీ కంటెంట్ గురించి లీలామాత్రంగా తెలుసు. ఇక ట్రైలర్ ని చూశాక కచ్చితంగా ఇది మరో లెవెల్ మూవీ అని అర్ధమవుతోంది. రాజమౌళి డైరెక్షన్ మెరిట్స్ కూడా ట్రైలర్ లో బాగా కనిపించాయి. ఇక సినిమా లో సీరియస్ నెస్, ఎమోషన్స్ కి పెద్ద పీట వేస్తూనే నాటు సాంగ్ ద్వారా కమర్షియల్ వ్యాల్యూస్ ని కూడా బాగా బ్యాలన్స్ చేశారు అని అర్ధమవుతోంది.

మొత్తానికి చూస్తే ట్రిపుల్ ఆర్ కేవలం ఫ్యాన్స్ కి కాదు మొత్తం సినీ ప్రియులకు విందు భోజనం అని చెప్పాల్సి ఉంటుంది. బాలయ్య అఖండ మూవీ రిలీజ్ అయి రికార్డులు బద్ధలు కొడుతోంది. వంద కోట్లను సులువుగా తెచ్చేలా ఈ మూవీ ఉంది.

ఇపుడు ట్రిపుల్ ఆర్ ని తీసుకుంటే బాహుబలిని మించి వేయి కోట్లను తెస్తుందా రెండు వేల కోట్లను దాటెస్తుందా అన్నదే చూడాలి. ఏది ఏమైనా ట్రిపుల్ ఆర్ ఒక రికార్డు క్రియేట్ చేయడం ఖాయమన్న మాట సినీ లవర్స్ నుంచి వినిపిస్తోంది. సో అంతా వెయిటింగ్ ఇక్కడ. ఇదే మాట అంతటా.




మరింత సమాచారం తెలుసుకోండి:

rrr