
ఇక ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రీ రివ్యూ అదిరిపోయే రేంజ్ లో టాక్ ని సంపాదించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సర్కారు వారి పాటలో మహేష్ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు అదిరిపోయే పెర్ఫార్మన్స్ కనబరిచారని, ఆయన స్టైల్, యాక్టింగ్, డైలాగ్స్, ఫైట్స్ అన్ని కూడా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ కూడా ఎంతో ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఇక తెరపై సూపర్ స్టార్ కి జోడిగా నటించిన కీర్తి సురేష్ కూడా తన పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించారని, కథలో ఆమెది కూడా ముఖ్య పాత్రే అని, హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ అదిరిపోయాయని అంటున్నారు. ఇక సినిమాకి మది ఫోటోగ్రఫి, దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన తీరు ఎంతో బాగున్నాయని చెప్తున్నారు.
అలానే రాక్ స్టార్ థమన్ అయితే సాంగ్స్ తో పాటు బీజీఎమ్ కూడా మరొక లెవెల్లో ఇచ్చారట. కీలక యక్షన్, ఫైట్ సీన్స్ లో థమన్ తన మార్క్ బీజీఎమ్ తో మూవీని మరొక లెవెల్ కి తీసుకెళ్లారని, ఫస్ట్ హాఫ్ ఎంతో అదిరిపోయిన సర్కారు వారి పాట మూవీ, సెకండ్ హాఫ్ కూడా ఎంతో బాగుందని చెప్తున్నారు. ఓవరాల్ గా పక్కాగా మాస్, యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సర్కారు వారి పాట రాబోయే రోజుల్లో సూపర్ గా కలెక్షన్స్ అదరగొట్టడం ఖాయం అని తెలుస్తుంది. మరి నేడు తొలిరోజు తొలి ఆట నుండి ఈ సినిమా ఎంత మేర బాక్సాఫీస్ దగ్గర పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలని అంటున్నారు విశ్లేషకులు.