టాలీవుడ్ లో మొదట అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు హీరో నవీన్ చంద్ర. ఇక తన మొదటి సినిమాతోనే పరవాలేదు అనిపించుకున్న నవీన్ చంద్ర ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక అరవింద సమేత వంటి చిత్రంతో విలన్ గా నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. పలు చిత్రాలను క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించారు నవీన్ చంద్ర. ఎన్నో చిత్రాలలో విలక్షణమైన పాత్రలను సైతం మెప్పిస్తూ ఉన్నారు నవీన్ చంద్ర



తాజాగా కొద్ది రోజుల క్రితం తండ్రి కాబోతున్నట్లు తెలియజేస్తూ కొన్ని ఫోటోలను కూడా విడుదల చేశారు. తన భార్యతో ఉన్న ఫోటోలను షేర్ చేయడం జరిగింది. తాజాగా ఇప్పుడు నవీన్ చంద్ర భార్య ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లుగా తెలుస్తోంది.తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు.దీంతో నవీన్ చంద్ర కుటుంబం ఆనందంలో మునిగి తేలుతోంది. నేను ఊర్మా మగ బిడ్డతో ఆశీర్వదించబడ్డాము...ME AND ORMA అంటూ క్యాప్స్ అన్ని తెలుపుతూ పుట్టిన చిన్నారితో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను సైతం నవీన్ చంద్ర షేర్ చేయడం జరిగింది.


ఇందులో చిన్నారి కాలుని ముద్దాడుతూ ఉన్నటువంటి ఫోటోలను చూసి ఆయన కళ్ళల్లో ఆనందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోలేదని పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నవీన్ చంద్ర షేర్ చేసిన ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. నవీన్ చంద్ర ప్రస్తుతం సినిమాలే కాకుండా పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటున్నారు. హీరోగా నవీన్ చంద్ర ఒక బైలింగ్వల్ మూవీలో కూడా నటిస్తున్నట్లు సమాచారం ఇందులో అమృత అయ్యార్ , వాణి భోజన్ కూడా హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నవీన్ చంద్ర కి సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: