60 సంవత్సరాల వయసు దాటినా సీనియర్ హీరోలు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ లు వరసపెట్టి చేస్తున్న సినిమాల లిస్టు చూస్తుంటే యంగ్ హీరోలు కూడ ఆశ్చర్యపోతున్నారు. ఉదయం 8 గంటలకే షూటింగ్ స్పాట్ కు వస్తున్న వీరి కమిట్మెంట్ ను చూసి ఇండస్ట్రీ వర్గాలు కూడ షాక్ అవుతున్నాయి. లేటెస్ట్ గా బాలకృష్ణ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ అతడి అభిమానులకు షాక్ ఇస్తోంది.


కన్నడ సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు హర్ష శివరాజ్ కుమార్ బాలకృష్ణ రజనీకాంత్ లను కలిపి ఒక భారీ మూవీ ప్రాజెక్ట్ చేయడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈమధ్యనే జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు బాలకృష్ణ పిలవగానే అతిధిగా శివరాజ్ కుమార్ వచ్చాడు.


అతడితో పాటు దర్శకుడు హర్ష కూడ రావాడమే కాకుండా అంత హడావిడిలోనూ బాలకృష్ణకు హర్షను పరిచయం చేసి అతడి ఆలోచనలలో ఉన్న శివరాజ్ కుమార్ బాలకృష్ణ రజనీకాంత్ లు కలిసి నటించే ఒక మల్టీ స్టారర్ గురించి చెప్పినట్లు టాక్. ఈ ప్రాజెక్ట్ గురించి హర్ష చెప్పగానే బాలయ్య మరో మాట చెప్పకుండా ఫైనల్ స్క్రిప్ట్ తో తనను కలవమని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది. పీరియాడిక్ డ్రామాగా ఉండబోయే ఈమూవీ కథలో బాలయ్య రజనీకాంత్ శివ రాజ్ కుమార్ లకు సమాన ప్రాధాన్యత ఉండే విధంగా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.


ఇప్పటికే ‘కేజీ ఎఫ్’ తో ప్రశాంత్ నీల్ ‘కాంతారా’ తో రిషబ్ శెట్టి తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు దర్శకుడు హర్ష డ్రీమ్ మూవీ ప్రాజెక్ట్ కూడ ఫైనల్ అయి అది కూడ సూపర్ సక్సస్ అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కన్నడ దర్శకుల హవా తారాస్థాయికి చేరుకునే ఆస్కారం ఉంది. అంతేకాదు ఈ వయస్సులో బాలకృష్ణకు కన్నడ తమిళ మార్కెట్ లో కూడ మంచి క్రేజ్ ఏర్పడే ఆస్కారం ఉంది..
మరింత సమాచారం తెలుసుకోండి: