టాలీవుడ్ లో వరుస హిట్లతో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా "గాండీవధారి అర్జున ".ఈ మూవీని ప్రవీణ్ సత్తారు చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఏజెంట్ బ్యూటీ సాక్షివైద్య హీరోయిన్గా నటిస్తూ ఉండగా..ఈ సినిమా కి చాలా కూల్ అండ్ క్లాసిక్ మెలోడీ సాంగ్స్ అందజేస్తున్నారు మిక్కి జే మేయర్.ఈ సినిమాను ప్రముఖ స్టార్ డైరెక్టర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఇక అతి త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ టీజర్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు మేకర్స్. కేవలం ఈ చిన్న టీజర్ తో నే సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అని తేలిపోయింది. సరికొత్త కంటెంట్ ని ఎంకరేజ్ చేస్తూ..ఇండస్ట్రీలో మంచి స్టార్ హీరోగా ఎదుగుతున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఖచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ అందుకుంటాడు అంటూ చెప్పుకొస్తున్నారు మెగా అభిమానులు.


ఇంకా అంతేకాదు ఈ సినిమా మొత్తం ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది అని టీజర్ లోనే తెలిసిపోతుంది.టీజర్ లో వరుణ్ తేజ్ కార్ ను స్పీడ్ గా డ్రైవ్ చేయడం..ఇంకా పెద్ద పెద్ద తుపాకులను కారులో పెట్టుకుని.. భారీ యాక్షన్ సీన్స్ లో ఫైట్ చేయడానికి రెడీ అవడం మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా తర్వాత కచ్చితంగా మెగా ప్రిన్స్ మంచి యాక్షన్ హీరోగా పేరు సంపాదించుకుంటాడు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు. కాగా ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. దీంతో మెగా అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకొని ఉన్నారు . ఇక ఎంగేజ్మెంట్ తర్వాత ఫస్ట్ రిలీజ్ అయిన టీజర్ కావడంతో అభిమానులు ఈ టీజర్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి ఖచ్చితంగా మెగా హీరో వరుణ్ తేజ్ కు లక్ ని తీసుకువస్తుంది అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: