అలనాటి సీనియర్ హీరోయిన్స్ ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూ ఉన్న హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో జయసుధ కూడా ఒకరు. ఒకప్పుడు స్టార్ రేంజ్ లో సినిమాలలో నటించిన ఈమె సహజ నటిగా పేరు సంపాదించింది. ప్రస్తుతం అమ్మగా పలు సినిమాలలో పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నది. అయితే హీరోయిన్ గా ఉన్న సమయంలో జయసుధ లుంగీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఫోటో కూడా వైరల్ గా మారుతున్నది.


అయితే ఈ ఫోటోలో జయసుధ లుంగీ కట్టుకొని కనిపించింది. ఆడవాళ్లు, మగవాళ్ళను  కూడా ఆకర్షించే శంకుమార్క లుంగీలుకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినట్లు ఇందులో చాలా క్లియర్ గా వివరించారు. అప్పట్లో హీరోయిన్గా వ్యవహరిస్తున్న సమయంలో వీటికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ ఫోటో 1970లో తీసినట్లుగా సోషల్ మీడియా యూజర్ రాసుకొచ్చారు. వీటిని చూసిన పలువురు నెటిజెన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


ముఖ్యంగా యాడ్ బాగుందని ఆడవాళ్లు కూడా లుంగీలు కట్టుకోవచ్చని అప్పట్లోనే నిరూపించారు అంటూ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. మొదటిసారి లుంగీలకు అమ్మాయిలు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం చూసి మరికొంతమంది ఆశ్చర్యపోగా.. తమిళనాడు, కేరళలో అప్పట్లో అలాగే వినియోగించే వారేమో అంటూ మరి కొంతమంది ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ప్రకటన బర్మిస్ భాషలో ఉందని ఇప్పటికీ కూడా అక్కడ అమ్మాయిలు లుంగీలను ఉపయోగిస్తున్నారని సమాచారం. మొత్తానికి జయసుధ ఓల్డ్ పిక్ మాత్రం ఇప్పుడు అభిమానులను చాలా ఆకట్టుకుంటున్నది.సీనియర్ హీరోయిన్గా పేరుపొందిన జయసుధ ఈ మధ్యకాలంలో పెళ్లి విషయం పైన కూడా ఈమె గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తూ ఉన్నది. వీటన్నిటి పైన క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఆగడం లేదు. ప్రస్తుతం భైరవం సినిమాలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: