
హరిహర వీరమల్లు మనకు తెలిసి ఇది నాలుగు ఐదు సంవత్సరాల ప్రాజెక్టు .. కానీ అంతకుమించి ఎన్నో ఏళ్ళు పట్టిన సినిమా ఇది. ఈ విషయం ఎవరికీ తెలియదు. పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీ సూర్య మూవీస్ అధినేత ఏఎం. రత్నం ఈ హరిహర వీరమల్లు సినిమాను నిర్మిస్తున్నారు. ఐదు సంవత్సరాలుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూ వస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా ఇదే నిర్మాత ఖుషి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తెరకెక్కించారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన బంగారం సినిమా అంచనాలు అందుకోలేదు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడుగా ఇదే బ్యానర్లో సత్యాగ్రహి అనే సినిమా ప్రారంభించారు. అనుకోని కారణాలవల్ల ఈ సినిమా ఆగిపోయింది. కొద్ది రోజులు షూటింగ్ కూడా జరిగిపోయింది. ఆ వెంటనే ఏం రత్నంకు మరో సినిమా చేస్తానని పవన్ హామీ ఇచ్చారు.
మధ్యలో ఏకంగా 15 ఏళ్లు టైం గడిచిపోయింది. మధ్యలో వేదాళం సినిమా రీమేక్ చేయాలని అనుకున్నారు. ఏం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా అనుకున్నారు.. కానీ ఎన్నికల వల్ల అది కుదరలేదు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా మొదలుపెట్టారు. మధ్యలో అనుకోకుండా దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. అలా పవన్తో సత్యాగ్రహి సినిమా టైమ్ నుంచి ఎం రత్నం ఎదురు చూస్తూ వస్తున్నారు. ఈ లెక్కను చూస్తే హరిహర వీరమల్లు సినిమా కోసం దాదాపు 15 సంవత్సరాలు పైగా నిర్మాత ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఇక హరిహర వీరమల్లు సినిమాలో ఓ ఫైట్ మొత్తాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ కంపోజ్ చేశారట. ఆ ఒక్క ఎపిసోడ్ కోసమే దాదాపు ఆయన 50 నుంచి 60 రోజుల కష్టపడ్డారని నిర్మాత రత్నం తెలిపారు. జూన్ 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు