కొన్ని సంవత్సరాల క్రితం ఏదైనా భాషలో ఒక సినిమా వచ్చి దానికి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంశలు వస్తున్నాయి అంటే చాలు వారం తిరగకుండానే ఆ మూవీ యొక్క రీమేక్ హక్కులను అనేక భాషల వారు కొనుక్కునేవారు. అలాగే వాటిని చాలా స్పీడ్ గా రూపొందించి విడుదల చేసేవారు. అలా విడుదల చేసిన రీమిక్ సినిమాలలో అనేక సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఓటిటి ఫ్లాట్ ఫామ్ లు భారీగా అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుండి రీమిక్ సినిమాలు పెద్దగా వర్క్ అవుట్ కావడం లేదు.

ఏదో ఒకటి , రెండు సినిమాలను మినహాయిస్తే రీమిక్ సినిమాలు ఈ మధ్య కాలంలో ప్రేక్షకాదరణ పొందిన దాఖలాలు కూడా పెద్దగ కనిపించడం లేదు. కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ "ఉస్తాద్ భగత్ సింగ్" అనే మూవీ ని మొదలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ తమిళ సినిమా అయినటువంటి తేరి కి రీమేక్ గా రూపొందుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ మధ్య కాలంలో రీమిక్ సినిమాలను ప్రేక్షకులు అస్సలు ఆదరించకపోవడం , అలాగే హరీష్ శంకర్ ఆఖరుగా దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ మూవీ రైడ్ మూవీ కి రీమేక్ గా రూపొంది భారీ అపజయం సాధించడంతో ఈయన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ని రీమేక్ గా కాకుండా కొత్త కథతో రూపొందించే ఆలోచనకి హరీష్ శంకర్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే తాజాగా పవన్ "హరిహర వీరమల్లు" అనే సినిమాను పూర్తి చేశాడు. ఈ మూవీ ని జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పవన్ "ఓజి" మూవీకి డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ మూవీ షూటింగ్ కూడా మరి రెండు రోజుల్లోనే కంప్లీట్ కాబోతున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ను పవన్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఆ లోపు హరీష్ శంకర్మూవీ కి కొత్త కథను రెడీ చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: