ఎన్ని రియాలిటీ షోస్ వచ్చినా ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీస్ ఆ రియాలిటి షోలో పాల్గొన్న బిగ్ బాస్ రియాల్టీ షో కి వచ్చిన కిక్ - క్రేజ్ ఆ ఫీలింగ్ మిగతా వాళ్ళకి రానే రాదు . అదేంటో తెలియదు బిగ్ బాస్ షో ని తిట్టే జనాలే ఆ బిగ్ బాస్ షో ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు . ఆ విషయం అందరికీ తెలుసు.  బిగ్ బాస్ ద్వారా లైఫ్ సెటిల్ చేసుకున్న వాళ్లు కొంతమంది అయితే ఆ షో ద్వారా ఉన్న లైఫ్ ని నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది.  ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ విన్నర్ అయితే అతనికి కెరియర్ ఉండదు అనే విషయాన్ని చాలామంది మాట్లాడుకుంటూ వస్తారు.

త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతుంది . ఈ సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున నే హోస్టుగా చేయబోతున్నాడు అంటూ దాదాపు క్లారిటీ వచ్చేసింది. అయితే ఈసారి సీజన్ 9 లో మాత్రం కంటెస్టెంట్స్ ను తోపైన సెలబ్రిటీస్ తీసుకురాబోతుందట మేనేజ్మెంట్ . మరీ ముఖ్యంగా పలువురు యూట్యూబర్స్ తో పాటు కాంట్రవర్షియల్  కంటెంట్ ఎక్కువగా ఇచ్చే స్టార్స్ ని రంగంలోకి దించుతుందట.  ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని విధాలుగా ఆలోచించి కంటెస్టెంట్ లను ఫైనలైజ్ చేసుకున్నట్లు తెలుస్తుంది . మరీ ముఖ్యంగా ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 లోకి అలేఖ్య చిట్టి పికిల్ సిస్టర్స్  లో ఒకరు ఫైనలైజ్ అయ్యారు అంటూ టాక్ వినిపిస్తుంది .

ఈ మధ్యకాలంలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూ ఎంత హైలెట్గా మారిందో తెలిసిందే. అంతేకాదు సీరియల్ స్టార్స్ అదే విధంగా ప్రముఖ యూట్యూబర్స్ ని ఈ సీజన్లో సెలెక్ట్ చేసుకున్నారట.  మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హిస్టరీలోనే ఎప్పుడు లేని విధంగా విడాకులు తీసుకున్న ఒక స్టార్ సింగర్ కపుల్ ని ఈ హౌస్ లోకి పంపించబోతున్నారట . విడాకులు తీసుకున్న కపుల్ ని  హౌస్ లోకి పంపిస్తే ఎంత కాంట్రవర్షియల్  కంటెంట్ వస్తుందో అర్థం చేసుకోవచ్చు.  దాని ప్రకారం బిగ్ బాస్ ఈ విధంగా టిఆర్పి రేటింగ్స్ పెంచుకోవడానికి ఆ మోస్ట్ లవబుల్ విడాకులు తీసుకున్న కపుల్స్ ని హౌస్ లోకి పంపేలా ఫైనలైజ్ చేసిందట.  ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈసారి కాంట్రవర్షియల్ కంటెంట్ బాగానే వచ్చేలా ప్లాన్ చేసుకుంది బిగ్ బాస్ మేనేజ్మెంట్ అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు జనాలు . తుది జాబితాను బిగ్ బాస్ నిర్వహకులు అధికారికంగా తెలియజేసే వరకు వెయిట్ చేయాల్సిందే..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: