
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమాలలో ఓజీ ఒకటి. పవన్ నటిస్తోన్న హరిహర వీరమల్లు - ఉస్తాద భగత్‌సింగ్ రెండు సినిమాల కంటే కూడా ఓజీ మీదే భారీ అంచనాలు ఉన్నాయి. సాహో తర్వాత యంగ్ దర్శకుడు సుజీత్ తో చేస్తున్న సాలిడ్ యాక్షన్ డ్రామా పవన్ కెరీర్లోనే పీక్ హైప్ లో ఉంది. పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉండడంతో ఏపీ లో అయితే ఓజీ సినిమా మీద క్రేజ్ మామూలుగా లేదు. అసలు గత ఏడాది లోనే విడుదల కావాల్సిన ఈ సినిమాకి ఇప్పుడు ఎట్టకేలకు లైన్ క్లీయర్ అవుతోంది.
తాజాగా హరిహర వీరమల్లు సినిమా ను జూన్ 12న రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఈ సినిమా చివర్లో కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు ఎట్టకేలకు వీరమల్లు సినిమాను జూలై 24న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో ఓజి కి లైన్ క్లియర్ అయ్యినట్టే అని చెప్పాలి. ఇక ఈ యేడాది మూడు నెలల గ్యాప్ లో పవన్ నుంచి వస్తోన్న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా తాండవం చేస్తాయో ? చూడాలి. రెండు వరుస రిలీజ్‌లతో పవన్ అభిమానుల ఆనందానికి అయితే బ్రేక్‌లు ఉండవనే చెప్పాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు