మాస్ మహారాజా రవితేజ హిట్ అందుకొని చాలా కాలం అవుతుంది. రవితేజ వరుస పెట్టి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆయనకు సరైన విజయం మాత్రం దక్కడం లేదు. ఆఖరుగా రవితేజ కు ధమాకా సినిమాతో విజయం దక్కింది  ఈ సినిమా తర్వాత ఈయన చాలా మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇలా వరుస పెట్టి అపజాయాలను అందుకుంటున్న రవితేజ ను చూసి ఆయన అభిమానులు రవితేజ ప్రస్తుతం నటిస్తున్న మాస్ జాతర సినిమాతో కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు అని గట్టి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు.

ఈ సినిమాకు సంబంధించిన అనేక విడుదల తేటలు వైరల్ అవుతున్నాయి. కానీ ఈ మూవీ మాత్రం విడుదల కాపడం లేదు. మొదట ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. ఆ తర్వాత ఈ సినిమాను మే 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అయింది. ఇక ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను ఆగస్టు 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఆ తేదీన కూడా పోస్ట్ పోన్ అయ్యింది. చాలా మంది సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన సినిమాలన్నీ మంచి విజయాలు అందుకుంటున్నాయి. మాస్ జాతర సినిమాను ఆయనే నిర్మిస్తున్నాడు.

సినిమా కూడా మంచి విజయం అందుకుంటుంది అని రవితేజ అభిమానులు గట్టి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ మధ్య కాలంలో నాగ వంశీ కి కూడా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఈయన నిర్మించిన కింగ్డమ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది. అలాగే ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన వార్ 2 సినిమా కూడా ఫెయిల్యూర్ అయింది. దానితో రవితేజ అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt