
దీంతో ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది జగన్ సర్కార్. ఇప్పటికే రకరకాల మార్గాల ద్వారా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా కొత్త ఆస్తి పన్ను ప్రభావం కూడా మొదలు కానుంది. ప్రస్తుతం తాజాగా సవరించిన ఆస్తిపన్ను ప్రకారమే ఆయా పురపాలక సంఘాలు కూడా డిమాండ్ నోటీసులను జారీ చేస్తున్నాయి ఇప్పుడు. గతంలో అద్దె విలువ ప్రకారం పన్ను విధించే వాళ్లు. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఆస్తి మూలధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించాలని జగన్ సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసేసుకుంది. దీని వల్ల ప్రస్తుతం ఉన్న పన్ను కంటే కూడా ఆస్తి పన్ను 10 నుంచి 15 శాతం పెంచేసింది ప్రభుత్వం. సవరించిన పన్నులతో కూడిన కొత్త నోటీసులను కూడా ఇప్పటికే మునిసిపల్ అధికారులు అన్ని ఇళ్లకు అందజేస్తున్నారు కూడా. ఇప్పటికే పెరిగిన పన్నులు, ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మరో చేదు వార్త. త్వరలో ప్రభుత్వం పెంచిన ఆస్తిపన్ను మేరకు నోటీసులను అందిస్తోంది. ఈ మేరకు కొత్తగా సవరించిన ఆస్తిపన్ను కట్టాల్సి ఉంటుంది. వచ్చే ఆర్ధిక సంవత్సరం తొలి ఆరునెలలకు నోటీసులను ప్రభుత్వం జారీ చేస్తోంది.