
ఇక ఈ యువ క్రికెటర్లు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. కాగా ఓపెనర్ గా కాదని వీరిద్దరిని వేరే స్థానంలో ఆడించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వేరే స్థానాల్లో ఆడే ఆటగాళ్లు కూడా ఇప్పటికే ఫిక్స్ అయి ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక రోహిత్, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్లు విశ్రాంతి తీసుకున్న సమయంలో ఇక టి20 ఫార్మాట్లో శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లు ఓపెనర్లుగా అవకాశాన్ని దక్కించుకుంటున్నారు. అయితే గిల్ ఒకవైపు సెంచరీలతో చెలరేగిపోతూ ఉంటే.. ఇషాన్ కిషన్ వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు.
ఇలాంటి సమయంలో గిల్ కు తోడుగా మరో దూకుడు అయిన బ్యాట్స్‌మెన్‌ను ఓపెనర్ గా తీసుకువస్తే బాగుంటుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం ఇదే విషయంపై స్పందించాడు. యువ సంచలనం పృద్విషాకు ఓపనర్ గా అవకాశం ఇవ్వాలి అంటూ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. ఇద్దరు కలిసి ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. షాకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది అంటూ అభిప్రాయపడ్డాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో టి20 సిరీస్ కి అతన్ని ఎంపిక చేసిన తుది జట్టులో చోటు దక్కకపోవడం పై ఇక ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు ఇర్ఫాన్ పఠాన్.