వాట్సాప్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఇక ఈ యాప్ ద్వారా మనం వీడియో కాల్, వాయిస్ కాల్ వంటి సదుపాయాలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక ఇతరులతో చాటింగ్ కూడా చేయవచ్చు. ఇలాంటి ఎన్నో సదుపాయాలు అందించిన వాట్స్అప్ ఇప్పుడు ఒక సరికొత్త ఫీచర్ తో మన ముందుకు వచ్చింది. ఆ విషయాలను తెలుసుకుందాం.

వాట్సాప్ లో ప్రతి ఒక్కరూ స్టేటస్ లు పెడుతూ ఉంటారు. అలా మనకు తెలిసిన వాళ్లు కూడా స్టేటస్ లు పెడుతూ ఉంటారు. వాటిలో మనకు నచ్చిన ఫోటోలను, వీడియోలను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇంతకుముందు సాధ్యం అయ్యేది కాదు. అలాంటప్పుడు మనం వారిని ఆ స్టేటస్ పంపమని కోరుతూ ఉంటాము. కానీ ఇకమీదట ఆ అవసరం లేకుండా, వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చట.

అది ఎలాగంటే" gip file" ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే..

మొదటగా మన ఆండ్రాయిడ్ మొబైల్ లో ప్లే స్టోర్ నుంచి  "Google file app" ను డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది. కొంతమందికి ఈ యాప్ ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా ఉంటుంది. అలా లేనివారు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన తర్వాత.. ఈ ఫైల్ ఓపెన్ చేయగానే కింద చూపిన విధంగా ఈ మూడు చుక్కల మీద క్లిక్ చేయండి.
అలా చేసిన తర్వాత కిందకి స్క్రోలింగ్ చేయడం వల్ల setting ఆప్షన్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేయాలి.
ఆ తర్వాత show hidden files కనిపించిన ఆప్షన్ పై క్లిక్ చేసి , దానిని ఎనేబుల్ చేయాలి.
ఆ తర్వాత రీసెంట్ యాప్స్ తీసేసి తిరిగి మరి గూగుల్ files ను ఓపెన్ చేయాలి. అప్పుడు అక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ మీద క్లిక్ చేయాలి. అందులో వాట్సాప్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. అందులోనే media అనే ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత.. స్టేటస్ ఫోల్డర్ కనిపిస్తుంది. అలా ఓపెన్ చేయగా , మనం చూసిన వాట్సాప్ స్టేటస్ మొత్తం అక్కడ కనిపిస్తాయి
ఒకవేళ మీరు గనక వాట్సాప్ స్టేటస్ లో hidden files ఆన్ లో ఉంచితే, అన్ని వీడియోస్ అక్కడ సేవ్ అవుతాయి. తరువాత ఇది మనం షేర్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: