కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్: 2కప్ పచ్చిబఠానీ: 3 టేబుల్ స్పూను బీన్స్, క్యారెట్: 1/2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) లవంగాలు: 2 యాలకులు: 2 చెక్క: చిన్న ముక్క కుంకుమ పువ్వు: చిటికెడు షాజీర: ½ టీ స్పూను పాలు: 1 టీ స్పూను బిర్యాని ఆకు: 1 నూనె లేదా నెయ్యి: 3 టేబుల్ స్పూను ఉప్పు : రుచికి సరిపడా ఆచారికి కావలసిన పదార్థాలు: పన్నీర్: 2 కప్పులు(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) పెరుగు: ½ కప్ పసుపు: ½ టేబుల్ స్పూను మెంతులు: ¼ టేబుల్ స్పను ఆవాలు: ½ టీ స్పూను పచ్చిమిర్చి ఊరగాయ మసాలా: 1 టీ స్పూను జీలకర్ర: 1 టీ స్పూను ఆవనూనె: 1 టీ స్పూను ఉప్పు: రుచికి సరిపడా తయారు చేయు విధానం: 1. ముందుగా ఒక లోతైనటువంటి ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో బియ్యాన్ని శుభ్రంగా కడిగి సరిపడి నీళ్ళు పోసి, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. 2. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పాలు వేసి అందులో కుంకుమ పువ్వు వేసి బాగా నాననివ్వాలి. కుంకుమపువ్వు పాలలో బాగా నాని పాలు కలర్ మారితన తర్వాత వాటిని చల్లారబెట్టిన అన్నంలో వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. 3. తర్వాత పెరుగు, పచ్చిమిర్చి పికెల్, పసుపు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, నువ్వులు, ఆవ నూనె మరియు ఉప్పు ను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. 4. మసాలా మెత్తగా అయిన తర్వాత ఒక గిన్నెలోని వంచుకొని అందులో పన్నీర్ ముక్కలను వేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. 5. అరగంట తర్వాత మసాలాలో ఉన్న పన్నీర్ ముక్కలను పక్కకు తీసుకొని, కొద్దిగా నూనె వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ ముక్కలు తీయగా మిగిలిన మసాలను అలాగే పక్కన పెట్టుకోవాలి. 6. తర్వాత ఒక పాన్ స్టౌ మీద పెట్టి అందులో నెయ్యి లేదా నూనె వేసి వేడయ్యాక అందులో షాజీర, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యాని ఆకు వేసి వేయించాలి. తర్వాత అందులోనే మిగిలిన మసాలా పేస్ట్ ను కూడా రెండు నిముషాలు వేయించి, అందులోనే పచ్చిబఠానీ, బీన్స్, క్యారెట్ కూడ వేసి బాగా ఉడికించాలి కొద్దిసేపటి తర్వాత అందులో అన్నం, వేయించి పెట్టుకొన్న పన్నీర్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే పన్నీర్ పలావ్ రెడీ. ఏదేని సైడ్ డిష్ తో సర్వ్ చేయాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: