దేశంలో మార్చి నెల నుంచి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి కరోనాని కట్టడి చేయానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతిరోజూ మరణాలు, కేసుల సంఖ్య పెరిగిపోతుంది. కాకపోతే రికవరీ రేటు కూడా బాగానే ఉండటం కొంత ఉపశమనం ఇస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి.  ముఖ్యంగా ఏపీలో కరోనా వైరస్‌ వ్యాప్తి శరవేగంగా కొనసాగుతోంది.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతున్న‌ది. రాష్ట్రంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 9,999 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

దీంతో క‌రోనా బాధితుల సంఖ్య 5,47,686కు చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 96,191 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌రో 4,46,716 మంది బాధితులు మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు.   ఇప్ప‌టివ‌ర‌కు కొత్తగా 77 మంది బాధితులు మృతిచెందారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 4779కు పెరిగింది. ఈమేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య ఆరోగ్య‌శాఖ హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: