ఇక న్యూజిలాండ్‌తో రాయ్‌పూర్‌లో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు ఒక రేంజిలో విజృంభించారు. ఫస్ట్ ఓవర్‌లోనే ఓపెనర్‌ ఫిన్ అలెన్‌ను దెబ్బకు క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు షమి.ఇక అప్పటికి కివీస్‌ బ్యాటర్లు పరుగులు ఇంకా చెయ్యలేదు. దీంతో వాళ్లు దెబ్బకు డిఫెన్స్‌లో పడిపోయారు. మ్యాచ్ ప్రారంభం నుంచి పూర్తయ్యే దాకా భారత బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించడంతో మొత్తం 34.3 ఓవర్లలో 108 పరుగులకే న్యూజిలాండ్‌ దెబ్బకు ఆలౌట్‌ అయింది. కివీస్‌ బ్యాటర్లలో మొత్తం 36 రన్స్‌తో ఫిలిప్స్‌ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.ఈ మ్యాచ్ లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. అందులో గ్లెన్‌ ఫిలిప్స్‌ (36) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మైఖేల్ బ్రాస్‌వెల్ (22) ఇంకా మిచెల్ శాంటర్న్‌ (27) పరుగులు మాత్రమే చేశారు. 


ఇండియన్ బౌలర్ల దెబ్బకి కివీస్ టాపార్డర్‌.. ఫిన్‌ అలెన్‌ (0), డెవాన్‌ కాన్వే (7), హెన్రీ నికోల్స్‌ (2), డారిల్ మిచెల్ (1) ఇంకా టామ్‌ లేథమ్‌ (1) పరుగులు మాత్రమే చేశారు.. వీరంతా కూడా 15 పరుగులకే పెవిలియన్‌ కు చేరారు. మొత్తం 8మంది బ్యాటర్లు కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.ఇక 10 ఓవర్లు పూర్తయ్యే సరికి న్యూజీలాండ్‌ స్కోర్‌ 15 పరుగులు మాత్రమే వుంది. సగం టీమ్‌ పెవిలియన్‌కు వెళ్లిపోవడంతో ఇక న్యూజిలాండ్‌ 108 పరుగులు కూడా చాలా కష్టం మీద చేయగలిగింది.మన బౌలర్లలో షమి 3వికెట్లు తీసి కివీస్‌ పతనాన్ని శాసించగా.. సుందర్ ఇంకా పాండ్యా రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్, శార్దూల్‌, కుల్దీప్‌ ఒక్కో వికెట్‌ చొప్పున తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: