మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ కెరియర్ ప్రారంభించిన ఈయన ఇప్పుడు స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. హిట్లు ఫ్లాప్ లు అన్నదాంతో సంబంధం లేకుండా వరస  సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు రవితేజ. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నప్పటికీ స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న కూడా కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూ కొత్త కొత్త దర్శకులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు మాస్ మహారాజా. ఇటీవల ఆయన నటించిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. 

మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సైతం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది . బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని తన కథలో వేసుకున్నాడు రవితేజ. దాంతో పాటు ఇటీవల ధమాకా సినిమా సినిమాతో మరొక విజయాన్ని అనుకున్నడు. అయితే ఎప్పుడూ హీరోగా బిజీ బిజీగా ఉండే రవితేజ ఫ్యామిలీ గురించి చాలామందికి తెలియదు. ఇక మాస్ మహారాజ రవితేజ కొడుకు రాజా ది గ్రేట్ సినిమాలో నటించిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక ఆ సినిమాలో రవితేజ చిన్ననాటి పాత్రను పోషించాడు రవితేజ కొడుకు. 

అయితే రవితేజ అసలు పేరు భూపతి రాజు రవిశంకర్ రాజు అని చాలామందికి తెలియకపోవచ్చు. ఇక ఆయన భార్య పేరు కళ్యాణి. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు మహాధన్ భూపతి రాజు. కూతురు పేరు మోక్షద భూపతి రాజు. అయితే వీరిద్దరి పిల్లలకి సంబంధించిన చిన్న వార్త కూడా బయటికి రాదు. ఇక వీరిద్దరిలో రవితేజ కొడుకు ఫోటోలు అప్పుడప్పుడు బయటకు వచ్చినా కూడా కూతురి ఫోటోలు ఇప్పటివరకు అస్సలు బయటికి రావు. అసలు చాలామందికి రవితేజ కూతురు ఎలా ఉంటుందన్న విషయం తెలియదు కావచ్చు ఇక రవితేజ కూతురు ఎలా ఉంటుందో ...రవితేజ లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వారిలో ఇక ఆ ఫోటోలు చూసిన ప్రేక్షకులు రవితేజ కూతురు అచ్చం హీరోయిన్ లాగా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: