సినిమా అనే మాధ్యమం చాలా గొప్పది. సినిమాల్లో రాణించాలనే ఆశతో ఎంతోమంది పుట్టిన ఊరు, ఇల్లు, కుటుంబాన్ని వదిలి తమ అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి మైళ్ల దూరం వెళ్తారు. అలా వెళ్లిన వారిలో తెలుగు సినిమా పరిశ్రమలో మూవీ మొఘల్ గా పేరు తెచ్చుకున్న డి.రామానాయుడు ఉన్నారు. పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కారంచేడు అనే గ్రామంలో. ఆరోజుల్లో ఆయన 100 ఎకరాల ఆసామి. అయినా ఉన్న ఆస్తిని, కుటుంబాన్ని వదిలి అప్పటి మద్రాస్ వెళ్లారు. అక్కడి నుంచి ఆయన ప్రాభవం ఓ చరిత్ర.

 

 

సినిమాలపై అభిమానంతో వాటిని నిర్మించాలనే తపనతో వెళ్లిన ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. సరిగ్గా 56 ఏళ్ల క్రితం ఆయన తొలి సినిమా తీశారు. ఎన్టీఆర్ తో రాముడు – భీముడు సినిమా తీసి తనలోని కళాతృష్ణ తీర్చుకున్నారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆయన కల నెరవేరింది. సినిమా అంతా పల్లెటూరు, పట్నం, కుటుంబ నేపథ్యంలోనే ఉంటుంది. ఇందుకు ఆయన పల్లెటూరి నేపథ్యం, వ్యవసాయం, కుటుంబ బాంధవ్యాలు పూర్తిగా తెలిసుండటమే కారణం. దీంతో రామానాయుడు ఆ ఒక్క సినిమాతోనే ఆగిపోలేదు. అనుకున్న కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయాలనే లక్ష్యం ఉన్న ఆయన మరిన్ని గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలు తీసారు.

 

 

అభిరుచి గల నిర్మాతగా కుటుంబ నేపథ్యాలున్ సినిమాలు తీయడంతో పాటు కాలానుగుణంగా కూడా అనేక సినిమాలు తీశారు. సినిమా నేపథ్యం ఏమీ లేకుండా ఓ గ్రామం నుంచి వెళ్లి సినీ నిర్మాతగా మారారు. అక్కడి నుంచి కొనసాగించిన మహా యజ్ఞాన్ని ఆయన తనయులు కొనసాగిస్తున్నారు. ఎంత ఎదిగినా ఆయన పుట్టిన గ్రామాన్ని మరచిపోలేదు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గ్రామాల ప్రాధాన్యాన్ని బేస్ చేసుకుని అనేక సినిమాలు తీసి అదర్శంగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: