అక్కినేని నాగార్జున నట వారసులలో ఒకరు అయినటువంటి అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన జోష్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇలా మొదటి సినిమాతో నాగ చైతన్య కు బాక్సా ఫీస్ దగ్గర చేదు అనుభవం మిగిలింది. అలాంటి సమయం లోనే ఈయన గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఏమాయ చేసావే అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సమంత హీరోయిన్గా నటించింది. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ 2010 వ సంవత్సరం థియేటర్లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో నాగ చైతన్య కు మొదటి విజయం దక్కింది. సమంత ఈ సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

ఈ మూవీతోనే ఈ బ్యూటీకి సూపర్ విజయాన్ని , మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మూవీ ని జూలై 18 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక ఈ మధ్య కాలంలో లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలకు రీ రిలీజ్ లో భాగంగా మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. దానితో ఈ సినిమాకు కూడా అద్భుతమైన కలెక్షన్లు రీ రిలీజ్ లో భాగంగా దక్కే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc