ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వారం అదిరిపోయే రేంజ్ లో ఓ టీ టీ లోకి కంటెంట్ వస్తుంది. పెద్ద ఎత్తున వెబ్ సిరీస్ లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని వెబ్ సిరీస్లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్న వెబ్ సిరీస్లలో దక్షిణ కొరియా సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ ఒకటి. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన మూడు సీజన్లు నెట్‌ ఫ్లిక్స్‌ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లోకి అందుబాటు లోకి వచ్చాయి. పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది.

దానితో ఈ వెబ్ సిరీస్ యొక్క రెండవ సీజన్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అలా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్ సిరీస్ రెండవ సీజన్ మొదటి సీజన్ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దానితో ఈ వెబ్ సిరీస్ మూడవ సీజన్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుంది అనే ఆసక్తి జనాల్లో పెరిగిపోయింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ యొక్క మూడవ సీజన్ నెట్‌ఫ్లిక్స్‌ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చింది.

ఇకపోతే ఈ మూడవ సీజన్ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది. రెండవ సీజన్తో పోలిస్తే మూడవ సీజన్ అద్భుతంగా ఉన్నట్లు అనేక మంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ విడుదలైన కేవలం మొదటి మూడు రోజుల్లోనే 60.1 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. జనాలు దీనిని మొత్తంగా 368.4 మిలియన్ గంటలకు పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. ఇలా ఈ వెబ్ సిరీస్ అద్భుతమైన రేంజ్ లో దూసుకుపోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: